భారతదేశంలో దాదాపు రెండు నెలల క్రితం ప్రవేశించిన కరోనా వైరస్ యొక్క విజృంభణ రోజుటికీ ఎక్కడ తగ్గినట్లు కనిపించట్లేదు. ఎప్పుడూ లేని విధంగా గత మూడు రోజుల నుండి రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఒకరోజు నమోదైన రికార్డు పక్క రోజుకి తుడిచిపెట్టుకుపోతుంది. బుధవారం ఒక్కరోజే 5611 పాజిటివ్ కేసులు బయటపడటం గమనార్హం. ఇక పెద్దసంఖ్యలో వైరస్ బారిన పడుతున్న వారికి ఆసుపత్రిలో వైద్యం అందిస్తూ బాధితులను వైరస్ నుండి విముక్తి చేసేందుకు కొన్ని ప్రయోగాత్మకమైన వైద్య చర్యలు తీసుకుంటున్నారు.

 

ఒకపక్క వైరస్ వ్యాప్తి దేశంలో నిరాటంకంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్లాస్మా థెరపీ తీసుకొని వచ్చి డాక్టర్లు మంచి రిజల్ట్ సాధించారు. అయితే ఇప్పుడు నవ్వులతో వైరస్ ను తగ్గించవచ్చని వైద్యుల భావించి ప్రయోగాత్మకంగా ముంబైలో ప్రయత్నించారు. రోగుల ఆత్మస్థైర్యం నింపేలా వారిలో భయం, ఆందోళన తొలగిపోయేలా వైద్యులు సరికొత్త విధానం మొదలుపెట్టారు. ప్లాస్మా థెరపీ ద్వారా రోగులలో రోగనిరోధక శక్తి పెంచి.. వైరస్ తో పోరాడే యాంటీబాడీలను ఉత్పన్నం చేయడమే దాని యొక్క లక్ష్యం. అయితే మనిషి మధ్యలో ఎటువంటి భయాందోళనలకు, భయభ్రాంతులకు, టెన్షన్ కు లోనవ్వకుండా నవ్వుతూ ఉంటే వారిలో మార్పు చాలా త్వరగా చోటు చేసుకుంటుందని శాస్త్రీయంగా కూడా రుజువులు ఉన్నాయి.

 

అందుకే రోగులు అందరూ ఆనందంగా ఉండేలా లాఫింగ్ థెరపీ ని ప్రయోగించడం షురూ చేశారు. బెడ్లపైన ఉన్న పాజిటివ్ బాధితులతో చప్పట్లు కొట్టి ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. కాసేపు ఆనందంగా నవ్వుకోవడంతో పాటు ఉల్లాసంగా ఉండేలా కబుర్లు చెబుతున్నారు. వైరస్తో భయపడాల్సిన పనిలేదని రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొత్త విధానం వైరస్ బాధితులు త్వరగా కోలుకునేందుకు దోహదం చేస్తుందని పలువురు చెబుతున్నారు. లాఫింగ్ థెరపిపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: