లోకంలో సంపాదన కోసం మనుషులు వివిధ మార్గాలను ఎంచుకుంటారు.. అందులో కొందరు ఒళ్లమ్ముకుని కూడా బ్రతికే వారున్నారు.. మరికొందరు డబ్బు కోసం చెయ్యకూడని పనులను కూడా చేస్తారు.. మొత్తానికి సంపాదన కోసం మనిషి ఎంతకైనా దిగజారడానికి సిద్దంగా ఉన్నాడు.. ఇలా అందరు కాదు.. కానీ దాదాపు సమాజంలో మంచి దార్లో కంటే సంపాదనకు చెడు మార్గాలు ఎంచుకున్న వారే ఎక్కువని చెప్పవచ్చు.. చెడు మార్గం అంటే స్మగ్లింగ్, హత్యలు ఇలాంటి నేరాలనే కాదు.. ఇతరుల పొట్టకొట్టి స్వార్ధంతో సంపాదించడం కూడా వస్తుంది.. నీతిగా బ్రతికే వాడు ఎన్నో అగ్నిగుండాలు దాటాలి.. అదే అవినీతికి దాసోహమైతే సంఘంలో తొందరగానే పెద్దమనిషి స్దానం వస్తుంది.. ఇక ఇదంతా పక్కన పెడితే అమెరికాకు చెందిన స్వీట్ అర్చెస్(28) అనే యువతి మాత్రం వీటన్నీటికి భిన్నంగా సంపాదిస్తుంది..

 

 

ఎంతో అందగత్తే అయినా ఈ యువతి తన పాదాలకూ సంబంధించిన ఫోటోలను ఆన్ లైన్ లో షేరు చేస్తూ నెలకు సుమారు 6 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ.4.6 లక్షలు) సంపాదిస్తోంది. ఇకపోతే ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌ ఉంటున్న అర్చెస్ ప్రస్తుతం మెడిసిన్ చదువుతోంది. కాగా తన చదువుకు అవసరమైన ఖర్చుల కోసం స్వంతంగా డబ్బు సంపాదించుకోవాలని భావించి ఇందుకు గాను ఆమె ఈ సరికొత్త మార్గాన్ని ఎంచుకుందట. ఇక స్వీట్ అర్చెస్ 2019 లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో తన పాదలను అందగా తీసిన ఫొటోలను పోస్టు చేయడం మొదలుపెట్టిందట. మనిషి బుర్రకో పిచ్చి ఉంటుందని అంటారు కదా.. ఇలా ఒకరకం పిచ్చి ఉన్న వారు ఈమె పాదాలకు ఫిదా కావడం మొదలు పెట్టారట..

 

 

అలా క్రమక్రమంగా ఫాలోవర్ల సంఖ్యా పెరిగింది. దీంతో స్పాన్సర్లు రావడం మొదలవగా, సోషల్ మీడియాలో పోస్టు ఆపేసి తనే సొంతగా ఓ వెబ్‌సైట్ రూపొందించింది. ఈ సైట్‌ను డబ్బులు చెల్లించి సబ్‌స్క్రైబ్ చేసుకుంటేనే ఆమె పాదాల ఫోటోలను చూడగలరు. కానీ అప్పటికి కూడా ఫాలోవర్లు ఆగలేదు.. అలా ప్రస్తుతం ఆ వెబ్‌సైట్‌కు వెయ్యిమంది సబ్‌స్క్రైబర్లు అయ్యారట.. అయితే ఈమె అందానికి ముగ్దులైన వారు కొందరు నగ్నంగా పడుకుని పాదాలను ప్రదర్శించాలని, పోర్న్ వీడియోలు చేయాలని అడుగుతున్నారట కానీ ఇందుకు ఆమె ఒప్పుకోను అని చెబుతుంది... ఎందుకంటే కేవలం నా పాదాలను అభిమానించేవారి కోసమే ఈ పని చేస్తున్నా. పోర్న్ ఇష్టపడేవారి కోసం కాదు అని నిర్మోహమాటంగా చెప్పింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: