దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో హైదరాబాద్ నగరవాసులను నైజీరియన్లు నమ్మించి మోసం చేస్తున్నారు. మాయమాటలు చెప్పి నగరవాసుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నగరంలో తాజాగా ఒక వ్యక్తి తాను అమెరికా నుంచి వచ్చానని... నిరుపేదల కొరకు మాస్కులు, శానిటైజర్లు పంపిస్తున్నానని నగరంలోని ఒక పాస్టర్ కు, మరో క్రైస్తవ మహిళకు ఫోన్ చేసి నమ్మించాడు. మరుసటిరోజు కస్టమ్స్ అధికారులు కొరియర్ ను పట్టుకున్నారని చెప్పి ఒకరి నుంచి 1,70,000 రూపాయలు, మరొకరి నుంచి 97,000 రూపాయలు వసూలు చేశాడు. 
 
నగరంలో ఒక నైజీరియన్ ముషీరాబాద్ కు చెందిన వ్యక్తికి 40 లక్షల రూపాయల లాటరీ వచ్చిందని... కొంత నగదు చెల్లించాలని నమ్మించాడు. బాధితుడు పలు దఫాలుగా 57,000 రూపాయలు చెల్లించి మోసపోయాడు. నగరంలో నివశించే మరో వ్యక్తి ఫేస్ బుక్ పేజీలో క్రెడిట్ కార్డ్ ఆఫర్ చూసి వివరాలు నమోదు చేశాడు. సైబర్ నేరస్థుడు క్రెడిట్ కార్డ్ కావాలంటే యాప్ డౌన్ లోడ్ చేయాలని చెప్పి ప్రముఖ ఈ వాలెంట్ కంపెనీ యాప్ డౌన్ లోడ్ చేయించాడు. 
 
ఆ తరువాత అతని బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించి 65,000 రూపాయలు ఇతర ఖాతాలకు మళ్లించాడు. క్రెడిట్ కార్డు పేరుతో, ప్రముఖ కంపెనీల యాప్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు. నిమిషాల్లోనే లక్షల రూపాయలు దోచేస్తున్నారు. ఇలాంటి కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 
 
సైబర్ క్రైమ్ పోలీసులు ప్రతిరోజూ ఇలాంటి మోసాల భారీన పడకుండా ప్రజలకు తగిన సూచనలు చూస్తున్నారు. సైబర్ క్రైమ్ మోసాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. అయినా సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త రూట్లలో మోసాలకు పాల్పడుతున్నారు. నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అపరిచితులకు బ్యాంకు ఖాతాలకు, క్రెడిట్ కార్డులకు సంబంధించిన వివరాలు చెప్పవద్దని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: