ప్రపంచంలో అదృష్టవంతులకంటే, దురదృష్టవంతులే ఎక్కువగా ఉన్నారన్న విషయం తెలిసిందే. అయితే చాలా మంది అదృష్టాన్ని నమ్ముకోకండి, మీ శ్రమను నమ్ముకోండని లెక్చర్స్ ఇస్తుంటారు.. శ్రమను నమ్ముకుని గాడిదలా చాకిరి చేస్తే వచ్చే ఫలితం సంగతి పక్కన పెడితే తొందరగానే చిక్కి రోగంతో మంచమెక్కడం ఖాయం.. అన్న విషయం అందరికి తెలిసిందే.. అయితే ఇక్కడ శ్రమను వదిలి సోమరుల్లా ఉండమని చెప్పడం లేదు.. మీరు పడే శ్రమకు అదృష్టం తోడైతే దాని ఫలితం సౌకర్యవంతంగా ఉంటుంది..

 

 

ఇకపోతే గత నాలుగైదు నెలల నుండి ప్రపంచాన్ని కరోనా వణికిస్తుందన్న సంగతి తెలిసిందే.. ఈ వైరస్ మూలంగా ధనవంతులు కొన్ని ఇబ్బందులు పడుతున్న, పేదవారు మాత్రం మరీ బీదవారిగా మారిపోయారు.. ప్రభుత్వాలు ఎన్ని పధకాలు పెడుతున్న అవి ఆకలి కడుపుల వరకు చేరడం లేదు.. మధ్యలో ఎన్నో పందికొక్కులను, ఎలుకలను దాటుకుంటూ వచ్చే వరకు మిగిలేది పిడికడు మాత్రమే.. దానితో ఎన్ని కడుపులు నిండుతాయి.. కానీ ఇప్పుడు మనం చూడబోయే వ్యక్తికి దక్కిన అదృష్టం చూస్తే మాత్రం అసూయలేని వారికి సైతం అది కలగడం సహజం.. ఎందుకంటే ఈ కరోనా సమయంలో ప్రతి పైసా విలువైనదే.. ఇలాంటి పరిస్దితుల్లో ఇతనికి లాటరీ ద్వారా ఏకంగా రూ.7.5 కోట్ల బంపర్‌ ప్రైజ్‌ తగిలింది..

 

 

వింటుంటే మనసులో ఆశ కలుగుతుంది కదా.. ఇకపోతే కరోనాతో దెబ్బతిన్న ఈ వ్యాపారిని వరించిన అదృష్టం గురించి తెలుసుకుంటే.. దుబాయ్‌లో స్థిరపడ్డ, కేరళకు చెందిన నిర్మాణ రంగం వ్యాపారి రాజన్‌ కురియన్‌ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన దుబాయ్‌ లాటరీ టికెట్‌కు ఏకంగా రూ.7.5 కోట్ల బంపర్‌ ప్రైజ్‌ తగిలింది. దీంతో రాజన్‌ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ సందర్భంగా రాజన్‌ మాట్లాడుతూ.. తాను గెలుచుకున్న సొమ్మును కరోనా వల్ల దెబ్బతిన్న తన వ్యాపారం నిమిత్తం ఉపయోగిస్తానని, మిగతాది కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న పేదలకు అందజేస్తానని పేర్కొన్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: