తెలంగాణ రాష్ట్రం ఆ విషయంలో దుమ్మురేపుతోంది. ఇంతకీ ఏ విషయంలో అంటారా.. ఐటీ విషయంలో. అవును.. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ దేశంలోనే మేటిగా నిలుస్తోంది. జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే రెండింతలకు పైగా అభివృద్ధి సాధించింది. తాజాగా తెలంగాణ ఐటీ శాఖ విడుదల చేసిన ఈ గణాంకాలు అదరహో అనేలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఐటీ రంగం ఎగుమతులు 2019-20 ఏడాదికి రూ.1,28,807 కోట్లకు చేరాయి.

 

 

ఐటీ రంగం ద్వారా తెలంగాణలో ఈ ఏడాది కొత్తగా దాదాపు 40 వేల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య ఆరు లక్షలకు చేరువవుతోంది 2019-20 ఏడాదికి తెలంగాణ రాష్ట్ర ఐటీ ఎగుమతులు 17.93 శాతం పెరిగాయి. కానీ జాతీయ సగటు మాత్రం 8.09 శాతంగా నమోదైంది. అంటే తెలంగాణ జాతీయ స్థాయి సగటుతో పోలిస్తే దాదాపు రెట్టింపు స్థాయికి చేరుకుందన్నమాట. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఐటీ ఎగుమతులు 10.6 శాతం నుంచి 11.6 శాతానికి పెరిగాయి.

 

 

 

ఐటీ రంగంలో ఇప్పటికే పేరుగాంచిన హైదరారాబాద్ కారణంగానే ఈ ఘటన తెలంగాణ వశమైందనే చెప్పాలి. అయితే ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఐటీ ఇతర నగరాలకు కూడా విస్తరిస్తోంది. చెప్పుకోదగ్గ స్థాయిలో టెక్‌ మహీంద్రా, సెయింట్‌ సంస్థలు వరంగల్‌లో కార్యకలాపాలు ప్రారంభించాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. అమెజాన్‌ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రాన్ని ప్రారంభించింది. మైక్రాన్‌ అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి సంస్థ కూడా హైదరాబాద్ కు వచ్చింది.

 

వాస్తవానికి ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా భయంతో అల్లాడుతోంది. దీని ప్రభావం ఐటీ రంగంపైనా పడే అవకాశం ఉంది. ఈ గణాంకాలు ఏడాది మొత్తానికి సంబంధించినవి.. కానీ లాక్ డౌన్ తర్వాత ఈ స్థాయిని కొనసాగించడమే తెలంగాణ ప్రభుత్వానికి అసలైన సవాల్ గా చెప్పుకోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: