ఏపీలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మ‌రో సారి తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే టీడీపీ నుంచి  ఈ యేడాది కాలంలో నే ఎంతో మంది కీల‌క నేత‌లు పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలోకో లేదా వైసీపీలోకో వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు వంతు మ‌రి కొంత మంది కీల‌క నేత‌ల‌ది అని అంటున్నారు. వాస్త‌వంగా చూస్తే టీడీపీకి ఇప్పుడు కేవ‌లం 20 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఉన్నారు. గన్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్‌, గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరిధ‌ర్ రావు, ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం ముగ్గురూ కూడా పార్టీ మారిపోయిన సంగ‌తి తెలిసిందే. వీళ్లు అధికారికంగా వైసీపీ కండువాలు క‌ప్పుకోక‌పోయినా స‌రే టీడీపీకి దూరం అయ్యారు. 

 

ఇక ఇప్పుడు మ‌ళ్లీ కొత్త ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సారి వంతు ప్ర‌కాశం జిల్లాది అని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ హాట్‌గా ప్ర‌చారం అయితే న‌డుస్తోంది. ఈ లిస్టులో ఒక‌రిద్దరు ఎమ్మెల్యే ల‌తో పాటు మ‌రో మాజీ మంత్రి కూడా ఉన్నార‌ని అంటున్నారు. ఇద్దరు నేతల అనుచరుల్లో కూడా ఇదే టాక్ వినిపిస్తోందట. అయితే దీనిపై జిల్లా వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతలు మాత్రం స్పందించ లేదు. ఇప్ప‌టికే ప్ర‌కాశం జిల్లా నుంచి ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రాం.. చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం సైకిల్ దిగిపోయారు.

 

ఇక బాల‌య్య స‌న్నిహితుడు అయిన మాజీ ఎమ్మెల్యే క‌దిరి బాబూరావు కూడా పార్టీ మారిపోయారు. ఇక తాజా లిస్టులో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ తో పాటు కొండ‌పి ఎమ్మెల్యే డోలా బాలీ శ్రీ వీరాజంనేయ స్వామి పేరు వినిపిస్తోంది. వీరిద్ద‌రు కూడా పార్టీ మారిపోతే జిల్లాలో అప్పుడు టీడీపీ కి ఒక్క పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు మాత్ర‌మే మిగులుతారు. అయితే ఏలూరి ఇప్ప‌ట్లో పార్టీ మారక‌పోవ‌చ్చ‌నే అంటున్నారు.

 

ఇక ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధా రాఘ‌రావు కూడా జంపింగ్ లిస్టులోనే ఉన్నార‌ట‌. సిద్ధా, గొట్టిపాటి పార్టీ మార‌వడం వెన‌క వీరి వ్యాపారాల‌కు ప్ర‌భుత్వం నుంచి ఇబ్బందులు రావ‌డ‌మే అంటున్నారు. ఇక ఈ లిస్టులోనే సీమ‌, గోదావ‌రి జిల్లాల‌కు చెందిన మ‌రో న‌లుగురైదుగురు మాజీ ఎమ్మెల్యేల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: