తాజాగా మీడియాతో మాట్లాడిన ఆర్.బి.ఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కరోనా  వైరస్ ప్రభావం భారతదేశం లో ఎంత తీవ్రంగా చూపించింది  అనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు. కరోనా వైరస్ ప్రభావం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించింది అని చెప్పుకొచ్చారు ఆర్.బి.ఐ గవర్నర్ శక్తికాంత దాస్. అయితే కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన తర్వాత మొదటి సారి ఆర్బిఐ గవర్నర్ మీడియా సమావేశం నిర్వహించారు. 

 

 అయితే భారతదేశం యొక్క డిమాండ్ పూర్తిగా పతనమైంది అంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు... విద్యుత్ ఉత్పత్తిలో ఎంతగానో సంక్షోభం ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చారు.. అంతేకాకుండా పెట్రోలియం ఉత్పత్తి వినియోగం కూడా గణనీయంగా పడిపోయిందని... ఇక ప్రైవేట్ వినియోగం కూడా పూర్తిగా పడిపోయింది అంటూ చెప్పుకొచ్చారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. భారత ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం నిరాశాజనకంగా ఉందని తెలిపారు ఆర్.బి.ఐ గవర్నర్ శక్తికాంత్ దాస్.

 

 

 

దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెరగడం... దేశవ్యాప్తంగా ఏకంగా 40 రోజుల పాటు లాక్ డౌన్  అమలుకావడం.. అప్పటికే ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న భారత్ ప్రస్తుతం మరింత దారుణ స్థితికి పడిపోవడం ఇదంతా జరిగిపోయింది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో నిరాశాజనకంగా ఉందని తాజాగా ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన శక్తికాంత దాస్ కరోనా వైరస్ ప్రభావం భారత దేశం పై ఎంత పడింది. ఏ విభాగం ఎంత సంక్షోభంలో కూరుకుపోయింది అనే విషయాన్ని క్లుప్తంగా వివరించారు.

 


 భారత వృద్ధిరేటు దారుణంగా పడిపోయింది అంటూ ఆర్.బి.ఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. 2020-21 లో జి.డి.పి వృద్ధి రేటు ప్రతికూల ఈ విభాగంలో ఉంటుంది అంటూ భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు... కాని ప్రస్తుతం మాత్రం భారత్  వృద్ధి రేటు నిరాశాజనకంగా ఉంది అంటూ తెలిపారు ఆర్బిఐ గవర్నర్. అయితే కరోనా  వైరస్ కారణంగా ప్రపంచ దేశాలలో కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అయితే భారతదేశంలో మాత్రం తీవ్రంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: