రేపో మాపో కాటికి పోయే వాడిలా ఉండే ఒక పెద్దాయన దారుణానికి పాల్పడ్డాడు. తన మనవరాలి వయసు ఉండే ఓ బాలిక పైన అమానుషానికి ఒడిగట్టాడు ఆ దుర్మార్గుడు. సదరు అమ్మాయికి మాయ మాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకుని గర్భవతిని చేశాడు కిరాతకుడు. ఇక ఈ విషయం పూర్తి వివరాల్లోకి వెళితే...

IHG' Strikes Again, Another Rape Attempt In Chirang ...
ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఐదు సంవత్సరాలు ఉన్న బాలికపై ఒక వృద్ధుడు కొన్ని నెలలుగా లైంగిక దాడి చేస్తున్నాడు. జిల్లాలోని గడ్డపోతారం పంచాయతీ పరిధిలోని కృష్ణయ్య పల్లి గ్రామానికి చెందిన దయానంద్ తన కుటుంబంతో కలిసి ఆ ఊరిలో నివసిస్తున్నాడు. ఇక వారి ఇంట్లో పని చేయడానికి అదే గ్రామానికి చెందిన ఒక పదిహేను సంవత్సరాల మైనర్ బాలిక పని చేస్తుంది. ఇది ఇలా ఉండగా సదరు బాలిక పై కన్నేశాడు దయానంద్. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలికకు కొన్ని మాయ మాటలు చెప్పి తనను లొంగదీసుకున్నాడు.

 

ఈ కథంతా కొన్ని నెలలుగా పునరావృతం అవుతూనే ఉంది. ఇలా కొద్ది నెలలుగా ఆ బాలికపై దయానంద్ లైంగిక దాడి చేస్తున్నాడు. అయితే ఆ బాలిక శరీరంలో మార్పులు గమనించిన కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని అసలు ఏం జరిగిందనే విషయం నిలదీయగా అప్పుడు ఆ అమ్మాయి అసలు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. ఇక అక్కడితో పోలీసులు, సదరు అమ్మాయిని ఆసుపత్రిలో చేర్పించి అక్కడి వైద్యులు పరిక్షించగా వైద్య పరీక్షల్లో ఆ బాలిక మూడు నెలల గర్భవతి అని తేలింది. ఇక దానితో దయానంద్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణకు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: