క‌రోనా క‌ల‌క‌లం..లాక్ డౌన్ అమ‌లు నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్‌లో ఉండిపోయిన సంగ‌తి తెలిసిందే. ఏపీలో ఎన్నో రాజ‌కీయ‌, అభివృద్ధి, సామాజిక ప‌ర‌మైన అంశాలు, అభివృద్ధి ప‌నులు, స‌మ‌స్య‌లు తెర‌మీద‌కు వ‌స్తున్న త‌రుణంలో... చంద్ర‌బాబు ఆ‌య‌న త‌న‌యుడు లోకేష్ ప‌క్క రాష్ట్రంలోనే ఉండిపోయార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కుంటున్నారు. ఏపీలో ఇలా విమ‌ర్శ‌లు ఎదుర్కుంటున్న త‌రుణంలో తెలంగాణ‌లో త‌న ఘ‌న‌త‌గా చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెప్పుకొనే ఐటీ విష‌యంలో ఆయ‌న‌కు షాక్ ఎదురైంది.

 

ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. భారత జాతీయసగటే కాదు.. దేశంలోని ఏ ఇతర రాష్ర్టాలు నమోదు చేయని వృద్ధిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.28 లక్షల కోట్ల ఎగుమతులను సాధించింది. రాష్ట్రంలో ఐటీ రంగం కొత్తగా 40వేల మందికి ఉపాధిని చూపింది. జాతీయ సగటు 8.09 శాతం, ఇతర రాష్ర్టాల సగటు 6.92 శాతం ఉండగా, తెలంగాణ రికార్డు స్థాయిలో 17.93 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తంగా దేశీయ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 23.53 శాతానికి చేరుకొని ఐటీలోనే మేటిగా నిలిచింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఎగుమతుల్లో అద్భుత ప్రగతి సాధించారంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలంగాణ ఐటీశాఖను అభినందించారు.

 

దేశంలో మ‌రే రాష్ట్రం సాధించ‌ని ఘ‌న‌త‌ను మ‌న హైద‌రాబాద్ సాధించడం తెలుగువారికి గ‌ర్వ‌కార‌ణ‌మే. అయితే, ఇదే స‌మ‌యంలో ఉమ్మ‌డి ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఐటీ రంగం త‌న ఘ‌న‌తేన‌ని ప్ర‌చారం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అస‌లు త‌ను లేక‌పోతే...ఐటీ రంగ‌మే లేద‌న్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌చార పటాటోపం ఉండేది. అలాంటి వ్య‌క్తికి, ఆయ‌న‌కు సంబంధం లేకుండా హైద‌రాబాద్‌కు ఉన్న భౌగోళిక‌, మాన‌వ వ‌న‌రుల సంబంధ‌మైన‌, సాంకేతిక నైపుణ్య‌త‌ల కృషి ఫ‌లితంగా విశేష‌మైన వృద్ధిని తెలంగాణ సాధించింది. ఈ ఫ‌లితాల‌ను తెలంగాణ‌లో చంద్ర‌బాబు ఉన్న స‌మ‌యంలోనే విడుద‌ల‌ చేసింది. ఇది కేసీఆర్‌కు దిమ్మ‌తిరిగే షాక్ అని ప‌లువురు నెటిజ‌న్లు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: