తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జనసేన పార్టీ కార్యకర్త ఉన్నమట్ల లోకేష్ పోలీసుల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్విటర్ ఖాతా వేదికగా లోకేష్ అనే ఓ యువకుడు ఇన్స్పెక్టర్ సి ఐ రఘు ఒత్తిడి కారణంగా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం చాలా బాధాకరమని... ఈ నిజాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపాడు. అక్రమాలను ప్రశ్నించిన వారినే వేధించడం చట్ట సమ్మతమా?  అని ఆయన పోలీసులను సూటిగా ప్రశ్నించారు. 


ఉన్నమట్ల లోకేష్ అక్రమ ఇసుక రవాణా కి అడ్డుకొని ప్రశ్నించేందుకు ముందుకు వచ్చాడు అంతమాత్రాన పోలీసులు అతడిని వేధించడం సబబా అని పవన్ కళ్యాణ్ మండిపడ్డాడు. తన పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు కారణమైన శ్రీ ఎస్సై రఘు పై చర్యలు తక్షణమే తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. లోకేష్ లోకేష్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలని తన పార్టీ నేతలకు పిలుపునిచ్చానని పవన్ కళ్యాణ్ అన్నాడు. పోలీసు అధికారి రఘు పై చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదావరి ఎస్పీకి తాను విజ్ఞప్తి చేసినట్టు తెలిపాడు. పోలీసులు ప్రజలకు మాత్రమే జవాబుదారీ అని అధికార పక్షానికి ఏమాత్రం కాదని ఆయన అన్నారు. 


పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక దందా ఇష్టారాజ్యంగా పెరిగిపోతుందని... అడిగే వారిని అణచి వేస్తున్నారని... ఇటువంటి క్రూరత్వపు ఇసుక దందా గురించి ఆ జిల్లాకు చెందిన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ స్థానిక జనసేన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఇకపోతే నిన్న యాంటీ టెర్రరిజం దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాన్ తన ట్విట్టర్ ఖాతాలో... ఉగ్రవాదం లేని ప్రపంచాన్ని కోరుకుంటూ, ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అమాయకుల ప్రాణాలను తీసేస్తూ మారణహోమం సృష్టిస్తున్న ఉగ్రవాదుల ఎదుర్కొంటూ తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న భద్రతా బలగాలకు సెల్యూట్ చేస్తున్నాం అనే ఒక ప్రకటన విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: