తమిళ చిత్ర పరిశ్రమలో  నటుడు మోహన్ లాల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది యువ హీరోలు సీనియర్ హీరోలు ఉన్నప్పటికీ మోహన్ లాల్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అయితే మోహన్ లాల్ ప్రతి సినిమాలో తనదైన యాక్షన్ తో  నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు అన్న  విషయం తెలిసిందే. ఇక మోహన్ లాల్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా  డబ్బింగ్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు . దీంతో మోహన్ లాల్ కు సంబంధించి ఏదైనా సినిమా వస్తుందంటే అటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. 

 


 అయితే మోహన్ లాల్ నటించిన తమిళ సినిమాల్లో  తెలుగులో డబ్బింగ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకొని సినిమా మన్యంపులి. తెలుగు చిత్ర పరిశ్రమలో మన్యంపులి సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది టాలీవుడ్ ప్రముఖులు సైతం మన్యంపులి సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. మన్యంపులి సినిమా లో  మోహన్ లాల్  చేసే యాక్షన్ కి ఫిదా అవని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. అడవిలో జీవించే మోహన్ లాల్... తన తమ్ముడి కోసం పడే కష్టాలు... అడవిలో జంతువులు ఎదిరించే ధైర్యం సాహసాలు సినిమా చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ కట్టిపడేస్థాయి. 

 


 ఇక ఈ సినిమాలో మోహన్ లాల్ భార్య పాత్రలో  అందం అభినయం కలగలిసిన ముద్దుగుమ్మ కమిలిని ముఖర్జీ నటించింది. ఇక కమలినీ ముఖర్జీ కూడా పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది ఈ సినిమాలో. అయితే మన్యంపులి సినిమా లో మోహన్ లాల్ చెప్పే డైలాగులు... అడవిలో పులి తో పోరాడుతున్న సన్నివేశాలు.. అంతేకాకుండా రౌడీలతో ఫైట్ చేస్తున్న యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తు  ఉంటాయి. అయితే ఇది తమిళ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల మనసును దోచేసిన సినిమాగా నిలిచిపోయింది  ఈ సినిమా . మోహన్ లాల్ కు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది తెలుగు చిత్ర పరిశ్రమలో.

మరింత సమాచారం తెలుసుకోండి: