దేశంలో కరోనా వైరస్ కేసులు ఉన్న కొద్దీ పెరుగుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ కఠినంగా అమలు చేసినా వైరస్ కంట్రోల్ అయిన దాఖలాలు ఎక్కడా కనబడలేదు. ముఖ్యంగా దేశంలో ఉన్న ప్రముఖ నగరాల్లో వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. తెలంగాణ రాష్ట్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే వైరస్ పాజిటివ్ కేసులు గత కొన్ని రోజుల నుండి ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఆగటంలేదు. మిగతా జిల్లాల పరిస్థితి బాగానే ఉన్నా గాని జిహెచ్ఎంసి పరిధిలో పరిస్థితి చాలా డేంజరస్ గా ఉంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తక్కువ కరోనా వైరస్ పరీక్షలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

 

కరోనా టెస్టుల సంఖ్య పెంచాల్సి ఉందని లేనిపక్షంలో ప్రమాదకర పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తుతాయని తెలంగాణ సర్కార్ కి తేల్చిచెప్పింది. ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కంటెయిన్‌మెంట్‌ విషయంలోనూ, వైద్య చికిత్స విషయంలోనూ ఎక్కడా రాజీ పడటంలేదనీ, టెస్టుల సంఖ్య గురించి రచ్చ అవసరం లేదని చెబుతోంది. అంతేకాకుండా ‘ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ మేరకే పరీక్షలు నిర్వహిస్తున్నాం..’ అని ఇటీవల తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు.

 

 ఇదే సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. కరోనా వైరస్ కేసుల విషయంలో కేసీఆర్ సర్కార్ వాస్తవాలు బయటికి చెప్పటం లేదని దాచిపెడుతోంది  అంటూ ఆరోపణలు చేస్తున్నాయి. రాజకీయంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గి రాజేసింది. నిన్న మొన్నటి వరకు సైలెంటుగా ఉన్న విపక్షాలు కరోనా వైరస్ పరీక్షల విషయంలో కేసీఆర్ సర్కార్ వెనుకబడిందని కహాని మాటలు చెబుతున్నారని విమర్శలు చేస్తున్నాయి. దీంతో కరోనా వైరస్ పరీక్షల విషయంలో కేసీఆర్ సర్కార్ కేసులు ఎక్కువగా పెరుగుతున్న చోటా టెస్టులు పెంచితే బాగుంటుందని చాలా మంది సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: