విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ విషయంలో మాటలకందని విషాదం అప్పట్లో నెలకొంది. మనుషులు, పశువులు మరియు చెట్లు స్టెరాయిడ్ సృష్టించిన విధ్వంసానికి బలైపోయాయి. గ్యాస్ లీక్ సమయంలో పిట్టల్లా కంపెనీ చుట్టుపక్కల మనుషులు రాలిపోవటం తో ఆ సంఘటనలు చూసి ఒక రాష్ట్రం కాదు దేశం మొత్తం దిగ్భ్రాంతి చెందింది. అలాంటి గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది చనిపోవడంతో జగన్ సర్కార్ వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. గాయపడిన వారికి మరియు చనిపోయిన వారికి పెద్ద ఎత్తున ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఇదిలా ఉండగా ఇటువంటి అత్యంత ప్రమాదకర ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీని జనం కోసం పక్కన పెట్టడానికి జగన్ రెడీ అయిపోయారు. 

 

ఇటీవల ఎల్జి పాలిమర్స్ బాధితుల తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సమయంలో కూడా ఈ విషయం గురించి భరోసా ఇవ్వడం జరిగింది. కచ్చితంగా న్యాయం చేస్తామని ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని జగన్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అత్యంత ప్రమాదకరమైన స్టైరిన్ మెటీరియల్ టన్నులకు టన్నులు విశాఖ నుంచి దక్షిణ కొరియాకు తిరిగి వెనక్కి పంపినట్లు కూడా తెలిపారు. కంపెనీ చుట్టుప్రక్కల ఉన్న ప్రతి గ్రామంలో పర్మినెంట్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నట్లు బాధితులకు భరోసా ఇచ్చారు. 

 

అప్పటికే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ మీద రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ కమిటీలు విచారణ చేపడుతున్నాయి. ఇటువంటి సమయంలో నివేదిక రాకముందే మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎల్జి పాలిమర్స్ కంపెనీ నీ అక్కడి నుండి తరలిస్తున్నట్లు ప్రకటించేశారు. సీఎం జగన్ కి ప్రజల కంటే ఎవరు ఎక్కువ కాదని ఆయన ఆదేశాల మేరకు రాష్ట్రంలో పరిశ్రమలు జనావాసాలకు దూరంగా ఉంచడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం మీద జనం కోసం ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన ఎల్జి పాలిమర్స్ కంపెనీ ని జగన్ తరలించడంతో మిగతా కంపెనీలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న ట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: