ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా క్షణాల్లో అరచేతిలో కనబడుతోంది. సోషల్ మీడియా పుణ్యమా ప్రతి వ్యక్తి ప్రపంచానికి ప్రతిక్షణం అప్ డేట్ అవుతున్నాడు. చదువుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఇటువంటి సమయంలో మీడియాలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకానొక టైంలో ప్రపంచంలో ఏదైనా సంఘటన జరిగితే అది పేపర్ లో మూడు రోజుల తర్వాత కనబడేది. విషయం వెలుగులోకి వచ్చేది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా రావడంతో కొద్దిగా ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ ప్రజల వద్దకు వచ్చేది. 

 

అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో ప్రపంచంలో ఎటువంటి సంఘటన జరిగిన ప్రతి ఒక్కరూ క్షణాల్లో తెలుసుకుంటున్నారు. అటువంటి సోషల్ మీడియాని  ప్రస్తుతం పొలిటికల్ పార్టీలు వేదికగా చేసుకుని ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు లైవ్ వీడియోలు ఇచ్చేస్తూ భయంకరమైన విమర్శలు చేసుకుంటున్నారు. ఎవరికి వారు జర్నలిస్టు అన్నట్టుగా తెగ లెక్చర్లు ఇచ్చేస్తున్నారు. 

 

ఓటు హక్కు లేని వాడు కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడకుండా ఉండి ఉంటే బాగుండేది అని సలహాలు ఇచ్చే రేంజ్ సోషల్ మీడియాలో ఉంది. ఇటువంటి తరుణంలో భవిష్యత్తులో సోషల్ మీడియాలో పెను యుద్ధం పొలిటికల్ పార్టీల మధ్య రాబోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారిని అరెస్టు చేయటం దీనిలో భాగమే అని అంటున్నారు. అదే సమయంలో ప్రతి పొలిటికల్ పార్టీ ప్రస్తుతం తమకంటూ సోషల్ మీడియా వింగ్  ఉండేలా చూసుకోవడం గమనార్హం. ఏదిఏమైనా భవిష్యత్తులో సోషల్ మీడియా వేదికగా భయంకరమైన పెను ప్రమాదం పొలిటికల్ పార్టీల మధ్య ఉండబోతుందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: