ప్రపంచంలో కరోనా వైరస్ ప్రభావం ఎప్పుడైతే మొదలైందో మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.  ఇప్పుడు మనుషుల్లో దూరం పెరిగింది.. కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే.  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 50 లక్షలు దాటిపోయింది. వైరస్ దెబ్బకు అమెరికా, బ్రిటన్ రష్యాలు అల్లాడిపోతున్నాయి. ఇక మొత్తం బాధితుల్లో 15 లక్షల మంది ఒక్క అమెరికాలోనే ఉండడం అక్కడి పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. వైరస్ వ్యాప్తి మొదలైన తొలి రోజుల్లో చైనా, అమెరికా, ఐరోపా దేశాల్లో విలయతాండవం చేసిన ఈ మహమ్మారి ప్రస్తుతం అక్కడ క్రమంగా తగ్గుముఖం పడుతుండగా.. రష్యా, బ్రెజిల్‌లో మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడంతో పలు దేశాలు ఆంక్షలను సడలించాయి. అప్పటి నుంచి కొత్త కేసులు మరింత పెరిగిపోతున్నాయి.

 

ఇక లాక్ డౌన్ కారణంగా  చాలా మంది ఇంటికే పరిమితం అవుతూ మానసికంగా కృంగిపోతున్నారు.. కొంత మంది ఉన్మాదులుగా మారిపోతున్నారు.  ఇలా ప్రపంచ వ్యాప్తంగా క్రైమ్ కూడా పెరిగిపోతుంది.  తజాా అమెరికాలో ఓ కొడుకు జూమ్ యాప్ లో తండ్రిని దారుణంగా చంపిన లైవ్ ప్రజెంట్ చేశాడు.  తండ్రిని కత్తితో పొడుస్తూ చంపుతూ ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలను జూమ్‌ వీడియో లైవ్‌లో చూపించాడో కుమారుడు. ఈ ఘటన అమెరికాలోని అమిటీవిల్లేలోని సౌత్ ఓక్స్ హాస్పిటల్ సమీపంలో చోటు చేసుకుంది.

 

ఇంట్లో ఉంటున్న  డ్వైట్‌ పవర్స్‌(70) తరుచూ తన స్నేహితులతో జూమ్‌ యాప్‌లో మాట్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో తన స్నేహితుడితో డ్వైట్‌ పవర్స్ మాట్లాడుతున్న సందర్భంగా హఠాత్తుగా ఆయన కుమారుడు స్కల్లీ పవర్స్‌(32) ఓ కత్తితో తండ్రిని దారుణంగా పొడుస్తూ లైవ్‌లో ఆ దృశ్యాన్ని అలాగే చూపించాడు. డ్వైట్‌ స్నేహితులు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు.  అప్పటికే హంతకుడు పారిపోయాడు. అతడి కోసం గాలించిన పోలీసులు స్కల్లీ జాడ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటనపై విచారణ జరుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: