కరోనా వైరస్ వల్ల రెండు నెలల నుండి దేశీయ అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వైరస్ అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ నిలిచిపోయిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి ముందే అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆపేసిన కేంద్రం ఆ తర్వాత దేశీయ విమాన రాకపోకలు కూడా ఆపేసింది. అయితే ఇటీవల వలస కూలీలు మరియు సామాన్యులకోసం రైళ్లు మరియు బస్సులు ప్రారంభించుకోవచ్చు అంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చేసింది కేంద్రం. అయితే ఈ సమయములో విమాన రాకపోకలు విషయంలో వెసులుబాటు ఇవ్వకుండా కేంద్రం నాన్చే కార్యక్రమం చేయటంతో విమానాల నే ఆధారం చేసుకుని ప్రయాణం చేసే వాళ్ళు  తమకి ఎప్పుడు కేంద్రం వెసులుబాటు కల్పిస్తోందని ఎదురు చూశారు. 

 

ఇటువంటి సమయంలో ఇటీవల ఇతర దేశాలలో చిక్కుకుపోయిన భారతీయుల కోసం కేంద్రం అంతర్జాతీయ ప్రత్యేక విమానాలను నడిపి వాళ్లని సురక్షితంగా స్వదేశానికి తరలించింది. అటువంటి సమయంలో రోజువారి విమాన సర్వీసులను దేశంలో ఈ నెల 25 నుంచి మొదలు పెట్టాలని ప్రకటించడంతో పాటు కట్టుదిట్టమైన నిబంధనలు జారీ చేసింది. సోషల్ డిస్టెన్స్, మాస్కులు, గ్లౌజులు సహా అనేక విషయాల్లో మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం టికెట్ల విషయంలో కూడా విధివిధానాలు రూపొందించింది. ప్రభుత్వ టికెట్ల రేట్లు ఆధారంగా నడిపించాలి అంటూ విమాన యాన సంస్థలకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ సమయంలో ఆన్లైన్ లో టికెట్ రేట్లు చూసిన ప్రయాణికులు మోత మోగిపోతున్నాయి ఇలా అయితే విమానం ఎక్కడం కష్టం అని అంటున్నారు. నిర్ధిష్ట సమయాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం దేశీయ ప్రయాణాల్ని ఆరు సెక్టార్లుగా విభజించింది. 

 

జర్నీ టైం బట్టి టికెట్ రేట్లు ఈ విధంగా ఉన్నాయి. 40 నిమిషాల లోపు ప్రయాణ సమయంలో ఉన్న ‘ఎ’ సెక్టార్లో ఛార్జీ కనీసం రూ.2 వేల నుంచి గరిష్టగా రూ.6 వేలు పెట్టుకోవచ్చు. 40-60 నిమిషాల మధ్య ప్రయాణ సమయం ఉంటే.. రూ.2500-7500 మధ్య, 60-90 నిమిషాల మధ్య అయితే రూ.3000-9000 మధ్య 90-120 నిమిషాల మధ్య అయితే రూ.3500-10000 మధ్య, 120-150 నిమషాల మధ్య అయితే రూ.4500-13000 మధ్య, 150-180 నిమిషాల మధ్య అయితే రూ.5500-15700 మధ్య, 180-200 నిమిషాల మధ్య అయితే రూ.6500-రూ.18600 మధ్య ఛార్జీలు ఉండాలని ప్రభుత్వం షరతులు విధించింది. అంటే కనిష్టంగా రూ.2 వేలతో మొదలై.. గరిష్టంగా రూ.18600కు మించకుండా దేశీయ విమాన ఛార్జీలు అందుబాటులోకి తెచ్చింది కేంద్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: