వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అంతా తానై పార్టీని నడిపించుకుంటూ పోతున్నారు. ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులతో మరియు గ్రామ వాలంటీర్ల తో సచివాలయ సిబ్బందితో పరిపాలన చేసుకుంటూ పోతున్నారు. దీంతో ప్రజలకు ఎమ్మెల్యేలతో పని లేకుండా ప్రభుత్వ పరంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు డైరెక్టుగా ఇంటికి చేరుకుంటున్నాయి. ఈ పరిణామంతో కేవలం ‘నామ్ కె వాస్తే’ లాగా ఎమ్మెల్యేల వ్యవహారం మిగిలిపోయింది. కనీసం ప్రజలకు తమ సమస్యల గురించి ఎమ్మెల్యే దాకా వెళ్లే ఛాన్స్ కూడా జగన్ ఇవ్వకపోవడం విశేషం. 

 

పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు పని లేకుండా పోతున్న తరుణంలో వారి తలరాత మార్చే విధంగా జగన్ సరికొత్త ప్లాన్ వేస్తున్నట్లు వైసీపీ పార్టీలో వార్తలు వినబడుతున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే ఈసారి నుండి నియోజకవర్గం లో ఉండే సచివాలయాలు పనితీరు ఎలా జరుగుతుంది అనేది ఎమ్మెల్యేలు చెక్ చేసే విధంగా జగన్ సరికొత్త ఆలోచన తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న తరుణంలో చాలా వరకు సక్సెస్ ఫుల్ గా పరిపాలన చేస్తూ మధ్యలో న్యాయస్థానాలలో మొట్టికాయలు వేయించుకున్న, ఏడాది పరిపాలన పర్వాలేదు అనేలా జగన్ పరిపాలించినట్లు పబ్లిక్ టాక్. 

 

ఇటువంటి సమయంలో ఇప్పటివరకు ఎమ్మెల్యేలకు పని లేకుండా పోవడంతో ఇకనుండి ప్రతి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కి కొన్ని కీలకమైన బాధ్యతలు జగన్ రానున్న రోజుల్లో ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు పని లేకుండా ఉన్న ఎమ్మెల్యేలు రానున్న రోజుల్లో పరుగులు పెట్టించే విధంగా జగన్ సరికొత్త కార్యక్రమం తెర మీదికి తీసుకువస్తున్నట్లు ఈ కార్యక్రమంలో జగన్ కూడా ఉండబోతున్నట్లు వైసిపి పార్టీ నుండి వార్తలు వస్తున్నాయి. మరి ఎటువంటి కార్యక్రమాలు ఎమ్మెల్యేలతో జగన్ చేపడుతున్నారో చూడాలి. జగన్ చేపట్టబోయే ఈ సరికొత్త కార్యక్రమాలతో ఎమ్మెల్యేల తలరాత పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని, ప్రజలలో వారికి మరింతగా ఆదరణ దక్కేలా కార్యక్రమం ఉండబోతోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: