కరోనా వైరస్ కట్టడికి దేశ‌మంతా ఒక్క‌టిగా నిలిచింది. లాక్‌డౌన్‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తూ ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. సుమారు 130కోట్ల మంది ప్ర‌జ‌లు ఒక్క‌టిగా నిల‌బ‌డ‌డాన్నిచూసిన ప్ర‌పంచం అబ్బుర‌ప‌డింది. భార‌త్‌పై ప్ర‌శంస‌లు కురిపించింది. అయితే... దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సమయంలో కొంద‌రు వలస కూలీలు, కార్మికులు మాత్రం తమ తమ స్వస్థలాలకు కాలిన‌డ‌క బ‌య‌లుదేరుతున్నారు. పట్టణాల్లో చిక్కుకున్న వారందరూ వంద‌ల కిలోమీట‌ర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలో కొందరు అలసిపోయి, మరికొందరు ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.

 

ఈ నేపథ్యంలోనే కొందరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అయితే ఇక్కడ కొందరు విశ్లేషకులు మాత్రం వీరి తీరును తప్పు పడుతున్నారు. వలస కూలీలు, కార్మికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయ‌ని, అయినా కూడా వలస కూలీలు కార్మికులు అనవసరంగా వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారని అంటున్నారు. వీరికి ప్రభుత్వాలు ఎంత భరోసా ఇచ్చిన కూడా వారి మానసిక ఆందోళన కారణంగానే నడుచుకుంటూ వెళ్తున్నారని అంటున్నారు. ఇదే స‌మ‌యంలో వీళ్లను రెచ్చగొట్టేందుకు కొందరు పనిగట్టుకొని మాట్లాడుతున్నారని, ఇదంతా కూడా దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు దారితీస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

 

కరోనా వైరస్ సృష్టించిన కష్టకాలంలో అందరు ఐక్యంగా ఉండాల్సింది పోయి ప్రజల్లో అనవసరమైన భయాలను క‌లిగించేందుకు ప్రయత్నం చేయడం మంచి పరిణామం కాదని చెబుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో వలస కార్మికులు కూలీలు తరలించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక్ రైళ్ల‌ను కూడా నడుపుతున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. నిజానికి వలస కార్మికులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయని, కానీ కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని పదే పదే రెచ్చగొట్టడం వల్లనే వారు బయటకు వస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఓవైపు కరోనా కట్టడిలో ప్రపంచ దేశాలకు భార‌త్‌ ఆదర్శంగా నిలిచిందని, ప్రజలందరూ ఒక్కటిగా నిలబడ్డారని ప్రపంచ మేధావులు మెచ్చుకుంటున్న‌ తరుణంలో ఇలా కొందరు వలస కార్మికులు, కూలీలను రెచ్చ‌గొట్టేందుకు ప్రయత్నించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అలాంటి ఆలోచనా ధోరణులకు దూరంగా ఉండాలని, దేశ ఐక్యత కోసం ముందుకు రావాలని సూచిస్తున్నారు. దీనిపై వలస కార్మికులు మద్దతు ధరలు ఏమంటారో చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: