ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 50 లక్షలు దాటిపోయింది. వైరస్ దెబ్బకు అమెరికా, బ్రిటన్ రష్యాలు అల్లాడిపోతున్నాయి. ఇ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ ప్రాణాంతక వైరస్ అత్యంత వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఇతర దేశాలన్నీ కరోనాతో సతమతమవుతున్న దశలో చైనాలో పరిస్థితులు కుదుటపడ్డాయి. 
క మొత్తం బాధితుల్లో 15 లక్షల మంది ఒక్క అమెరికాలోనే ఉండడం అక్కడి పరిస్థితిని చెప్పకనే చెబుతోంది.  జాన్స్‌ హాప్‌కిన్స్‌ కోవిడ్‌-19 వెబ్‌సైట్‌ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం నాటికి ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల‌  ప్రపంచవ్యాప్తంగా  3.33  ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు.

 

 

 

ఇప్పటికే చాలా దేశాలు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో కొత్తకేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది.  బ్రెజిల్‌లో మాత్రం వైరస్ చెలరేగిపోతోంది. అక్కడ గత 24 గంటల్లోనే ఏకంగా 1,179 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవే కావడం గమనార్హం. అలాగే, కేసుల సంఖ్య కూడా ఇక్కడ మూడు లక్షలకు చేరువైంది.   వైరస్ వ్యాప్తి మొదలైన తొలి రోజుల్లో చైనా, అమెరికా, ఐరోపా దేశాల్లో విలయతాండవం చేసిన ఈ మహమ్మారి ప్రస్తుతం అక్కడ క్రమంగా తగ్గుముఖం పడుతుండగా.. రష్యా, బ్రెజిల్‌లో మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తోంది.

 


 నిన్నమొన్నటి వరకు కోవిడ్‌తో విలవిల్లాడిన స్పెయిన్, ఇటలీ దేశాలు ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతుండగా, రష్యాలో కేసులు మూడు లక్షలు దాటాయి. ఇక త కొన్నిరోజులుగా చైనాలో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. వుహాన్ లోనూ కరోనా క్లస్టర్లు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, జిలిన్ ప్రావిన్స్ లో 34 మందికి కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

 

కరోనా మరణాలు ఎక్కువగా ఉన్న దేశాలు : 


అమెరికా(94,729)

బ్రిటన్‌(36,124)

ఇటలీ(32,486)

ఫ్రాన్స్‌(28,218)

స్పెయిన్‌(27,940)

బ్రెజిల్‌(20,047)

బెల్జియం(9,212)

మరింత సమాచారం తెలుసుకోండి: