దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రభుత్వాలు సహకరిస్తున్నా, శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసినా, ఇంకా సొంతూళ్లకు చేరుకోవాల్సిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. చాలామంది వలస కార్మికులు నడక మార్గం ద్వారా సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఈరోజు కీలక పిటిషన్లను విచారించిన హైకోర్టు వలస కార్మికుల గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
వలస కూలీలపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పేరు నమోదు చేసుకున్న వలస కార్మికులను 48 గంటల్లో బస్సులు ఏర్పాటు చేసి సొంతూళ్లకు పంపాలని పేర్కొంది. వలస కార్మికులు ఒకే రాష్ట్రానికి చెందిన వారైతే 98 గంటల్లో రైలు ఏర్పాటు స్వస్థలాలకు పంపించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం వలస కార్మికుల కొరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 
 
సౌకర్యాలు ఏర్పాటు చేస్తే శిబిరాల్లో ఎందుకు ఉండకుండా నడిచి వెళ్లారంటూ చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. విమర్శలకు ఇది సరైన సమయం కాదని, వలస కూలీల సమస్యలు మానవతా దృక్పథంతో చూడాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు సూచనల నేపథ్యంలో ప్రభుత్వం బస్సులు, రైళ్ల ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే 17 శాతం సర్వీసులను నడుపుతోంది. 
 
వీలైనంత త్వరగా వలస కార్మికులను సొంతూళ్లకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే వేల సంఖ్యలో వలస కార్మికులను సొంతూళ్లను తరలించిన ఏపీ సర్కార్ మిగిలిన వారిని తరలించడానికి చర్యలు చేపడుతోంది. అతి త్వరలో ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునేవారిని సొంతూళ్లకు చేరుస్తామని చెబుతోంది సొంతూళ్లకు తరలిస్తామని చెబుతున్నారు.                                   

మరింత సమాచారం తెలుసుకోండి: