ఏడాది ప్రారంభం నుండి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను విలవిల లాడిస్తోంది. ప్రజల ప్రాణాల పై మాత్రమే ప్రభావం చూపకుండా దేశాల ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తోంది. ఈ వైరస్ దెబ్బకు యూరప్ దేశాలు మరియు అగ్రరాజ్యం అమెరికా అయితే మూల్యం ఎక్కువగా చెల్లించు కుంటున్నాయి. ఇప్పటికీ కూడా యూరప్ దేశాలలో వైరస్ ఇంకా విస్తరిస్తూనే ఉంది. ముఖ్యంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలలో అయితే కరోనా వైరస్ విలయతాండవం సృష్టించింది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరోపక్క ఇండియాలో కూడా కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి ఎవరూ ఊహించని విధంగా పెరిగిపోతున్నయి. 

 

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య లక్షకి పైగానే దాటేసింది. ఇదే సమయంలో ఊహించని రీతిలో మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. లాక్ డౌన్ చాలా పటిష్టంగా అమలు చేస్తున్నా గాని పాజిటివ్ కేసులు ఉన్న కొద్ది బయటపడటంతో ప్రభుత్వ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి విషయంలో మరొక ఊహించని సంగతి వైద్యులు బయటపెట్టారు. అదేమిటంటే కరోనా వైరస్ నుంచి తప్పించుకున్న గాని దీర్ఘకాలిక సమస్యలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

 

 కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారికి రాబోయే భవిష్యత్తులో శారీరక మరియు మానసిక సమస్యలు కూడా తీవ్ర స్థాయిలో ఎదురయ్యే అవకాశం ఉందని ప్రాణానికి ముప్పు ఉందని అమెరికా దేశానికి చెందిన ఓ పరిశోధకుల బృందం ఇటీవల వెల్లడించింది. ముఖ్యంగా ఈ వైరస్ బారినపడి కోలుకున్న వారిలో ఆర్థికంగా సామాజికంగా బలహీనంగా ఉన్నవారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఉన్న కొద్ది కరోనా వైరస్ గురించి ఆందోళన కలిగించే వార్తలు రావడంతో ఈ వార్త విని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి వాటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేవిధంగా వ్యాక్సిన్ రావాలని కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: