జగన్ తండ్రి వైఎస్సార్ చనిపోయిన నాటికి మూడు నెలల ఎంపీ మాత్రమే. ఆ తరువాత ఆయన రెండవ సారి కడప్ ఉప ఎన్నికలో  ఎంపీగా బంపర్ మెజారిటీతో గెలిచారు. వైసీపీని ఏర్పాటు చేసి అన్ని ఉప ఎన్నికల్లోనూ టీడీపీకి డిపాజిట్లు గల్లంతు చేశారు. ఇక 2014 ఎన్నికల్లో త్రుటిలో అధికారం జారవిడుచుకున్న జగన్ ఆనాడే  ఫలితాల తరువాత ఒక మాట చెప్పారు. మేము ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహిస్తాం. ప్రజల మన్ననలు పొంది వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం అని. 

 

ఆ ప్రకారం 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చారు. బంపర్ మెజారిటీతో ఆయన గెలిచారు. 151 సీట్లు, యాభై శాతం పైగా ఓట్ల షేర్. ఇవన్నీ జగన్ సాధించిన ఘన విజయాలు, చరిత్ర లిఖించిన విజయాలు. ఇంతటి విజయం అందించిన రోజు మే 23. సరిగ్గా క్యాలండర్ని ఏడాది వెనక్కు తిప్పితే 2019 మే 23న ఉదయం ఈవీఎంలను తీశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో  లెక్క మొదలైన దగ్గర నుంచి వైసీపీ హవా ఒక్క లెక్కన సాగింది.

 

ఓ దశలో  నాటి  ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో గెలుస్తాడా అన్న డౌట్లు పుట్టాయి. ఇక ఏపీలో ఎక్కడ చూసినా వైసీపీకే ఓట్లూ, సీట్లు, ఏ మూల చూసిన ఫ్యాన్ పార్టీ జోరే కనిపించిన రోజు. ఓ విధంగా మే 28 రాష్ట్ర రాజకీయ చరిత్రలో గుర్తుండిపోతుంది. 1983 జనవరి 5న అప్పటి అగ్ర సినీ నటుడు ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీఎ ఎన్నికల ఫలితాలు ఎంతలా చరిత్రకు ఎక్కాయో అదే విధంగా జగన్ విషయంలో జరిగింది.

 

జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. నాటి ఫలితాలు ఇపుడు మళ్ళీ చర్చకు వస్తున్నాయి. ఇప్పటికి కూడా ఏపీలో బలమైన పార్టీగా వైసీపీ ఉంది. తిరుగులేని నాయకుడిగా జగన్ ఉన్నారు. జగన్ ఏడాది కాలంలోనే ఎన్నో పధకాలు అమలు చేసి జనం మెప్పు పొందారు. ఇచ్చిన హామీలను నూటికి తొంబై శాతానికి పైగా అమలు చేసిన ఘనత జగన్ కే దక్కుతుంది. మరి వైసీపీ ఆవిర్భావం తరువాత ఇంతటి అపూర్వ విజయం దక్కిన మే 23 నిజంగా చరిత్రలో నిలిచిపోయేదే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: