ఈ మధ్య ఏపీ బీజేపీ నేతలు కూడా జగన్ ప్రభుత్వంపై  ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దగ్గర నుంచి మొదలుపెడితే చిన్నాచితకా నేతలు కూడా తెగ ఫైర్ అయిపోతున్నారు. అయితే కాస్త జగన్‌కు అనుకూలంగా ఉండే బీజేపీ నేతలు కూడా రివర్స్ అయిపోయారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కలు చూపించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా వార్నింగ్‌లు ఇచ్చేస్తున్నారు.

 

తాజాగా జగన్ ప్రభుత్వం అతి చేస్తోందని సోము వీర్రాజు కామెంట్ చేశారు. విమర్శలు చేసిన వారిపై వైసీపీ ప్రభుత్వం అతిగా రియాక్ట్ అవుతుందని, గతంలో ప్రధాని మోదీపై చంద్రబాబు నల్లచొక్కాలు ధరించి అతిగా ప్రవర్తించి చివరికి ఏమయ్యారో అందరికీ తెలుసునని చెప్పారు. అలాగే చంద్రబాబు హయాంలో అవినీతికి పాల్పడిన కొందరు ఐఏఎస్‌లకే జగన్ ప్రభుత్వంలో కీలక పోస్టింగులు దక్కాయని మాట్లాడారు. పనిలో పనిగా నిర్భయంగా నిజాలు చెప్పిన డాక్టర్ సుధాకర్ వంటి వారిపై జగన్ ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించాలని కోరారు.

 

అయితే జగన్ ప్రభుత్వం కాస్త ఓవర్ యాక్షన్ చేస్తుందనే ఉద్దేశంలో మాట్లాడుతూ..గతంలో చంద్రబాబు అలాగే చేసి ఇంట్లో కూర్చున్నారంటూ వార్నింగ్ ఇచ్చారు. అంటే బీజేపీ పొత్తు నుంచి విడిపోయాక చంద్రబాబు, ప్రత్యేక హోదా పేరిట ధర్మపోరాట దీక్షలంటూ హడావిడి చేసిన విషయం తెలిసిందే. అప్పుడు నల్లచొక్కాలు వేసుకుని బాబు అండ్ బ్యాచ్ హల్చల్ చేశారు. వారి హడావిడికి తగ్గట్టుగానే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అయితే టీడీపీ ఘోరంగా ఓడిపోవడంలో బీజేపీ పాత్ర బాగానే ఉందనే టాక్ కూడా ఉంది.

 

అందుకే ఓడిపోయాక బాబు తప్పు తెలుసుకుని బీజేపీ భజన చేస్తున్నారు. కానీ ఆ భజన ఏమి ప్రస్తుతానికి వర్కౌట్ కాలేదు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ వీర్రాజు జగన్‌కు వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఇలాంటి విషయాల్లో జగన్ అసలు భయపడరన్న విషయం తెలిసిందే. పైగా ప్రజల సపోర్ట్ ఫుల్‌గా నాయకుడు వీర్రాజు లాంటి వారి వార్నింగ్‌లని పట్టించుకోవడం కష్టమే. కాబట్టి బాబుకు చుక్కలు చూపించినట్లు జగన్‌కు కూడా చూపించాలనుకోవడం సాధ్యమయ్యే పని కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: