కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా వచ్చిన ఈ వైరస్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలు అంతా చిన్నాభిన్నం అయిపోయాయి. వైరస్ ప్రభావం తో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది. కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా దేశాలు లాక్ డౌన్ అమలులోకి తీసుకురావడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో ఎక్కడికక్కడ ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉద్యోగాలు కూడా చేసే పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో లోన్ తీసుకున్న వారికి దేశంలో ఆర్బీఐ గుడ్ న్యూస్ అందించింది. 

 

ఇటీవల ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థకు చాలా తీవ్రమైన నష్టాలు వాటిల్లిందని అన్నారు. కారణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది అని తెలిపారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన సవాళ్లు ఉన్నాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ ను ఏడాది ద్వితీయార్థం నుంచి బలోపేతం చేయడం కోసం అనేక చర్యలు చేపట్టనున్నట్లు శక్తికాంత దాస్ చెప్పుకొచ్చారు. టర్మ్‌ లోన్ లపై మారటోరియం మరో 3 నెలలు పొడిగింపు ఇస్తున్నట్లు తెలిపారు. 

 

జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు టర్మ్‌ లోన్లపై మారటోరియం పొడిగిస్తున్నట్లు వివరించారు. దీంతో టర్మ్ లోన్ తీసుకున్న వారు మరో 3 నెలలు ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇదే సమయంలో  రెపో రేట్‌ను ఏకంగా 40 బేసిస్ పాయింట్స్ తగ్గించింది ఆర్బీఐ. ఈ నిర్ణయంతో రెపో రేట్ 4.4 శాతం నుంచి 4 శాతానికి దిగి వచ్చింది. రెపో రేట్ తగ్గడంతో వడ్డీ రేట్లు భారీగా తగ్గాయి. దీంతో బ్యాంకులో హోమ్ లోన్, వెహికిల్ లోన్ తీసుకునేవారికి ఆర్బీఐ బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు అయింది. ఆర్బీఐ రెపో రేట్ తగ్గించటం వల్ల సామాన్యులు లోన్ లు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉండటంతో వారికి చాలా బెనిఫిట్ అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: