దేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా ఎలా వ్యవహరిస్తుందో అందరికీ తెలిసిందే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమకు అనుకూలమైన పార్టీలకు అనుకూలంగా మీడియా ఛానెళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ప్రజలకు వాస్తవాలను చెప్పే మీడియా ఛానెళ్లు రోజురోజుకు కనుమరుగవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నా మెజారిటీ ఛానెళ్లు నేటికీ టీడీపీకే వంత పాడుతున్నాయి. 
 
రాష్ట్రంలోని ఒకటీ రెండు ఛానెళ్లు మాత్రమే అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నాయి. ఇదే సమయంలో ప్రజలు వెబ్ మీడియా, సోషల్ మీడియాపై వార్తల కోసం ఆధారపడుతున్నారు. దీంతో రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో కూడా ప్రత్యేక బృందాల ద్వారా ఎవరికి వాళ్లు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే తాజాగా టీడీపీ అనుకూల మీడియాలో చంద్రబాబుకు మద్దతు ఇచ్చే ఛానెళ్లన్నీ జగన్ కు అనుకూలంగా వ్యవహరించడానికి సిద్ధమవుతున్నాయని వార్త వచ్చింది. 
 
"ఒకప్పుడు మీడియాను శాసించే స్థాయిలో ఉన్న చంద్రబాబుకు నేడు మద్దతు ఇచ్చే వారే కరువయ్యారని... చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో మీడియా హవా పెరిగిందని.... ఆ తరువాత మీడియాలో చంద్రబాబుకు కొంత హవా తగ్గినా... 2014 ఎన్నికల ముందు టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి టీడీపీ అనుకూల మీడియా పడిన కష్టం అంతా ఇంతా కాదు. 
 
కానీ 2019 ఎన్నికల ముందు కొన్ని ఛానెళ్లు టీడీపీ ఐదేళ్ల పాలన వైఫల్యాలను తెలియజేయడంలో సక్సెస్ కావడంతో 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబుకు అనుకూలంగా పని చేసే మీడియానే లేదు" అని వార్త ప్రచురితమైంది. అయితే ఈ వార్త ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్ అని అన్ని పార్టీల నేతలు, అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు అనుకూల మీడియా ఎప్పటికీ ఒకే విధంగా వ్యవహరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: