మొదటినుంచీ ఇండియా దేశానికి పక్కనే ఉన్న దాయాది దేశం పాకిస్థాన్ దేశానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంటుంది అని అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ దేశం నుంచి ఉగ్రవాదులు ఇండియా లోకి ప్రవేశించి దేశంలో అలజడులు సృష్టిస్తూనే ఉంటారు. ఏమాత్రం సందు దొరికినా ఇండియాలో దాడులకు పాల్పడుతూనే ఉంటారు. నిన్న మొన్నటి వరకు ఉగ్రవాదులు మాత్రమే అనుకుంటే ఇప్పుడు తాజాగా మిడతల దండు పాకిస్తాన్ నుండి ఇండియా సరిహద్దుల్లో ఉన్న పంటలపై పడుతున్నాయి. పాకిస్తాన్ దేశం నుంచి వచ్చి పడుతున్న ఈ మిడతల దండు వల్ల ఇండియాలో వ్యవసాయం దెబ్బతినే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరికలతో భారత ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. 

 

దీంతో భారత్ సర్కార్ ఈ మిడతల దండు ను ఎదుర్కొనేందుకు బ్రిటన్ నుండి ప్రత్యేక డ్రోన్లు, ఫైర్ టెండర్లు, స్ప్రేయర్లను దిగుమతి చేసుకోవాలని ఆలోచన చేస్తోంది. పాకిస్తాన్ దేశం నుండి ఈ మిడతలు దాదాపు 150 కిలోమీటర్ల మేరకు ప్రయాణిస్తాయి అట. అంతేకాదు ఒక చదరపు కిలోమీటర్లు సమూహంలో ఉన్న మిడతలు 35 వేల మందికి సరిపడా ఆహారాన్ని గుటుక్కుమనిపించేయగలవని  ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తెలిపింది. 

 

ఇప్పటికే గుజరాత్ మరియు రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కొన్ని లక్షల హెక్టార్ల పంటలను నాశనం చేశాయి. దీంతో మిడతల దండు దాడిపై నివారణపై కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అయ్యింది. ఈ మిడతలు ఇంతగా విస్తరించడానికి కారణం ఆఫ్రికాలో తుఫానుల వల్ల మిడతల సంతానోత్పత్తి పెరగటం అని తేలింది. ప్రస్తుతం పాకిస్థాన్ దేశంలో ఈ మిడతల దాడికి అక్కడి ప్రభుత్వం వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. కాబట్టి ప్రస్తుతం భారత్ ఈ మిడతల విషయంలో ఫుల్ అలెర్ట్ అయ్యింది. మిడతలతో పోరాటానికి బ్రిటన్ నుండి అత్యాధునికమైన ఆయుధాలు సమకూర్చుకోవడానికి రెడీ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: