మనుషులు అన్ని కష్టాలను త్వరగా మరచిపోతారు.. కష్టాలు వచ్చినప్పుడే కన్నీళ్లు పెట్టుకుంటారు, తర్వాత ఏం తెలియనట్లుగా జీవిస్తుంటారు.. ఇది ఒక మనుషులకే సాధ్యం.. ఎందుకంటే లోకం మొత్తం కరోనా ప్రళయానికి స్దంభించి పోయి.. ఇప్పుడిప్పుడే రెక్కలు విచ్చుకున్న పక్షిలా మళ్లీ ఎగరడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది.. ఎందుకంటే చాల మంది తమను ఏ వైరస్ బాధించలేదు.. ఏదో చిన్న సమస్య వచ్చినట్లుగా కరోనాను ట్రీట్ చేస్తున్నారు.. కానీ కరోనా అనేది నాగలోకం కంటే భయంకరమైనది.. ఇప్పటి వరకు ఈ భూమి మీద వచ్చిన రోగాలకంటే గడుసైనది అని తెలుసుకోలేక పోతున్నారు..

 

 

నిజానికి ఈ వైరస్ బారిన పడ్దవారి కష్టాలు తెలుసుకుంటే, ముఖ్యంగా చావు చివరి వరకు వెళ్లి నూకలు బాకీ ఉండి బ్రతికి బట్టకట్టిన వారిని విచారిస్తే, ఈ కరోనా ఎంత భయంకరమైనదో అర్ధం అవుతుంది.. ఈ విషయాన్నే ఒక కండల వీరుడు చెప్పాడు.. ఎందుకంటే కరోనా వైరస్‌ బారినపడిన ఈ వ్యక్తి  కోలుకున్న తర్వాత అతడి శరీరంలో వచ్చిన మార్పు చూసి నెటిజన్లు కంగుతింటున్నారు. ఆ వివరాలు తెలుసుకుంటే.. కాలిఫోర్నియాకు చెందిన మైక్‌ షుల్ట్‌జ్ అనే వ్యక్తి గత మార్చిలో కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. అయితే మహమ్మారి నుంచి కోలుకోవడానికి అతడికి 6 వారాలు పట్టింది. కాగా ఆ వ్యక్తి‌ కరోనా కారణంగా దాదాపు 23 కిలోల బరువు తగ్గాడు.

 

 

అయితే కరోనా ప్రభావం ఎంతలా ఉంటుందో అవగాహన కల్పించేందుకు కరోనా సోకినప్పుడు ఆసుపత్రిలో తీసుకున్న ఫోటోతో పాటు కరోనాకు ముందు తీసుకున్న ఫొటోలను మైక్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘కరోనాకు ముందు నా బరువు 86 కిలోగ్రాములు. కరోనా తర్వాత ఇప్పుడు నా బరువు 63 కిలోగ్రాములకు పడిపోయింది. నిజానికి మైక్‌ శారీరకంగా బలమైన వాడే. అయితే కరోనా ఎలాంటి వారినైనా ప్రభావితం చేయగలదు. దానికి వయసుతో సంబంధం లేదు. మీరు ఆరోగ్య వంతులైనప్పటికీ కూడా ఈ మహమ్మారి మిమ్మల్ని ప్రభావితం చేయగలదు’ అంటూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలను హెచ్చరించాడు..

 

 

చూశారా కరోనా అంటే ఇంటిలో పెంచుకుంటున్న కుక్కలా భావించకండి.. లేదా అప్పుడప్పుడు వచ్చిపోయే చుట్టంలా చూడకండి.. ఇన్ని రోజులు ప్రభుత్వాలు కాపాడాయి.. ఇకనుండి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి.. అందుకు సిద్దపడి భయంతో బ్రతికితే బట్టకడతారు.. లేదా పాడే ఎక్కుతారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: