అమ్మ పిలుపులో అమృతం ఉంటుందంటారు. కాని నేటి కాలంలో అమ్మ అంటే కటిక చేదులా మారుతున్నారు.. అసలు ఆడతనానికి అమ్మ అయితేనే నిండుదనం చేకూరుతుందని పెద్దల మాట.. కనీసం అడవి మృగాలైన, కుక్కలైనా పిల్లల్ని కని వాటికి లోకజ్ఞానం తెలిసే వరకు కంటికి రెప్పలా చూసుకుంటాయి.. కానీ మనుషులు అని చెప్పబడే కౄరమృగాలు క్షణిక సుఖాల కోసం కన్న పిల్లల్నే కాటికి పంపుతున్నారు.. నిర్ధాక్షిణ్యంగా రోడ్ల మీద వదిలేసి వెళ్లుతున్నారు..

 

 

అసలు వారిని కనలేదనే భావంతో, పిల్లలంటే వారి సుఖాలకు అడ్దు అని భావిస్తూ వారిని తమ దారి నుండి తప్పిస్తున్నారు.. ఇదిగో ఇక్కడ కూడా తల్లి అని చెప్పబడే.. ఓ ఆడజాతి ఆణిముత్యం తన కూతుర్ని రోడ్డుపై విసిరేసి తన ప్రియునితో వెళ్లిపోయింది.. అమ్మతనానికి మచ్చలా మిగిలే ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. ఇక అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాట్రిస్ చాంబర్స్(29) అనే మహిళ న్యూయార్క్ నగరంలోని క్వీన్స్ స్ట్రీట్ ప్రాంతంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో తన కూతురిని కారు నుంచి తీసివేయడమే కాకుండా, తన కూతురి వస్తువులున్న బ్యాగును విసిరేసి రంకు మొగుడితో కలిసి వెళ్లిపోయిందట.

 

 

అక్కడ దిక్కు తోచని స్దితిలో ఏడ్చుకుంటు ఉన్న ఆ పాపను చూసిన స్థానికులు ఆ ఆరేళ్ల పాపకు భోజనం పెట్టి పోలీసులకు సమాచారమిచ్చారట. వెంటనే ఆ రక్షక భటులు ఆ పాప తల్లి, ఆమె బాయ్ ఫ్రెండ్‌పై వివిధ కేసులు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారట.. అయితే ఆ పాపను కారు దించేసిన ప్రాంతంలోనే  అసలు తండ్రి నివాసముందని.. ఈ కారణంగానే ఆ పాపను కన్నతల్లి అనే రక్కసి ఈ ప్రాంతంలో వదిలేసి ఉంటారని పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసుకు సంబంధించిన తీర్పును కోర్టు ఆగస్ట్‌లో ఇవ్వనుందట. ఒకవేళ వీరిద్దరూ చేసిన నేరం రుజువైతే ఈ కర్కోటకురాలికి, ఆమె ప్రియుడికి నాలుగేళ్ల శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: