ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా అమెరికా దేశంలో ఉంది. రోజులో దాదాపు లక్షకు పైగా కేసులు నమోదు అవుతుంటే వేల సంఖ్యలో అమెరికాలో మరణాలు సంభవిస్తున్నాయి. అయినా కానీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లో ఏమాత్రం చలనం రావటం లేదు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కొన్ని లక్షల మరణాలు కరోనా వైరస్ వల్ల అమెరికా లో సంభవిస్తాయని అధ్యక్షుడి స్థానంలో ఉన్న ట్రంప్ అనటం పట్ల విమర్శలు వస్తున్నాయి. దేశంలో కరోనా వైరస్ కట్టడి చేయాలని రోజు వందల మంది అమెరికా దేశంలో ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో అంతర్జాతీయ నగరం న్యూయార్క్ కరోనా మరణాలతో కుదేలవుతోంది. నిద్రలేని నగరంగా పేరొందిన న్యూయార్క్ లో కనీసం శవాలను ఖననం చేసే పరిస్ధితి కుాడా లేకుండా పోయింది. ఈ విధంగా కరోనా వైరస్ ప్రస్తుతం అమెరికా ని అతలాకుతలం చేస్తోంది. 

 

ఇదిలా ఉండగా కరోనా వైరస్ కంటే అమెరికన్లను భయపెట్టే మరొక సంఘటన వియత్నాం యుద్ధం. ఆసియా ఖండంలో ఉత్తర వియత్నాం తో అమెరికా దేశం యుద్ధం చేసి పంతానికి పోయి 58 వేల మందికి పైగా సైనికులను పోగొట్టుకుంది. ఇండియా దేశంలో కేరళ అంతా విస్తీర్ణం కలిగిన ఉత్తర వియత్నాం పై అప్పట్లో బాంబుల వర్షం కురిపించింది అమెరికా. ఆ సమయంలో ఉత్తర వియత్నాం దేశానికి చైనా మరియు రష్యా మద్దతు తెలపడంతో అమెరికా భారీ స్థాయిలో ప్రాణాలను మూల్యం చెల్లించుకుంది. 

 

సోవియట్ యూనియన్ దెబ్బకి ఉత్తర వియత్నం లో అమెరికా రాయబార కార్యాలయంలో తమ వ్యక్తులను రక్షించుకోవడానికి హెలికాప్టర్ల సాయంతో అంతస్తులో ఉన్న సిబ్బందికి తాళ్ల ద్వారా ఎక్కించుకొని అమెరికా పారిపోయింది. అటువంటి భయంకర సంఘటన వియత్నం తో తాజా కరోనా వైరస్ ని పోల్చుతున్నారు అమెరికన్లు. కరోనాపై పోరులోనూ అధ్యక్షుడు అనుసరిస్తున్న విధానాల వల్ల దేశం నష్టపోతుందన్నది సగటు అమెరికన్ల ఆందోళన. రోజుకు వేలసంఖ్యలో కేసులు వెలుగు చూస్తుండగా, వందల మరణాలు నమెాదవుతున్నాయి. దీంతో ఇటువంటి కరోనా వైరస్ పరిస్థితులను ప్రస్తుతం అమెరికన్లు బాగా భయపడే గుర్తొచ్చే సంఘటన వియత్నం తో పోల్చడం బట్టి పరిస్థితి అమెరికా లో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: