ఏబి  వెంకటేశ్వరరావు అంశం ఆంధ్ర రాజకీయాల్లో  గత కొన్ని నెలల నుంచి చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుకూ  కీలక సలహాలు ఇవ్వడంలో ఏబీ వెంకటేశ్వరరావు ప్రధాన పాత్ర పోషించారని... . ఎమ్మెల్యేల విషయంలో కానీ పాలన విషయంలో కానీ ఏబి  వెంకటేశ్వరరావు చంద్రబాబుకు ఎన్నో సలహాలు ఇచ్చారని.... అంతేకాకుండా ఒక పార్టీ కోసం  అధికారిగా కూడా  వెంకటేశ్వర పనిచేశారూ అంటు ఆరోపణలు చేసింది జగన్ సర్కార్. అయితే గత సంవత్సరం ఏబి  వెంకటేశ్వరరావును  జగన్ సర్కార్ ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా  ఏబీ  వెంకటేశ్వరరావుపై పలు అభియోగాలు మోపింది. 

 


 ముఖ్యంగా ఏబీ వెంకటేశ్వరరావు ని ఒక పార్టీ కోసం పని చేసిన అధికారిక ముద్ర వేసింది జగన్మోహన్రెడ్డి సర్కార్. అంతేకాకుండా ఏబీ వెంకటేశ్వరరావు తన కొడుకుతో కలిసి స్థాపించిన ఓ తయారీ కంపెనీ కి ప్రభుత్వ అనుమతి లేదు అంటూ పలు అభియోగాలు మోపుతూ  వెంకటేశ్వరరావును  ఉద్యోగం నుంచి తొలగించి ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ చేపడుతుంది. అయితే అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఏబి  వెంకటేశ్వరరావు పై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది. కానీ తాజాగా హైకోర్టు ద్వారా ఏబి  వెంకటేశ్వరరావు ఊరట లభించింది. 

 

 శ్ఏబీ వెంకటేశ్వర రావును ఇమీడియట్గా ఉద్యోగంలోకి తీసుకోవాలి అంటూ ప్రభుత్వానికి ఆదేశించింది హైకోర్టు. అదే సమయంలో ప్రభుత్వ ఉత్తర్వులను తోసిపుచ్చింది ఏపీ హైకోర్టు. అయితే న్యాయస్థానం ఇచ్చిన  ఆదేశాలు ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతూ ఉన్నట్లుగా ఉన్నాయి. మరి ప్రస్తుతం ప్రభుత్వం తీరు మార్చుకోవాలా  లేదా న్యాయస్థానాలు తీర్పు మార్చుకోవాలా అన్నది ప్రస్తుతం అందరిలో కలుగుతున్న ప్రశ్న . ఇది ఇప్పటికే జగన్ సర్కార్ పలు అంశాలలో న్యాయస్థానాలను  ఆశ్రయించి నిరాశ చెందిన విషయం తెలిసిందే. కొన్ని విషయాలలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్ కు షాక్ ఎదురైంది. మరి  జగన్ సర్కార్ తన తీరు మార్చుకుంటుందా  లేదా అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: