ఇండియా లో కరోనా తీవ్ర రూపం దాల్చింది. నాలుగో దశ లాక్ డౌన్ కొనసాగుతున్న కూడా కేసులు అతకంతకు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే రాత్రి 10గంటల వరకు దేశ వ్యాప్తంగా 6500 కేసులు నమోదయ్యాయి. సింగిల్ డే ఇప్పటివరకు ఇదే హైయెస్ట్.  ఒక్క మహారాష్ట్ర లోనే నిన్న 2940 కేసులు నమోదుకావడం గమనార్హం. టెస్టులు చేయించుకున్న ప్రతి నలుగురి లో ఒక్కరికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 44582కు చేరింది.
 
మహారాష్ట్ర తరువాత ప్రస్తుతం తమిళనాడు లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే  అక్కడ 786 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 14753దాటింది అంతేకాదు అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర తరువాత తమిళనాడు  రెండో స్థానం లో కొనసాగుతుంది. వీటితోపాటు ఢిల్లీలో నిన్న 660, గుజరాత్ లో 363 కేసులు నమోదయ్యాయి. 
 
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. నిన్న ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 62కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 2514కు చేరింది. అందులో ఇప్పటివరకు 55మందికరోనా వల్లమృతి చెందారు. కాగా గత కొన్ని రోజుల నుండి తెలంగాణ లో కూడా భారీగా కేసులు నమోదవుతున్నయి. నిన్న ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 62 కేసులు నమోదు కాగా ముగ్గురు మరణించారు. ప్రస్తుతం రాష్ట్రం లో మొత్తం కేసుల సంఖ్య 1761కి చేరగా మరణాల సంఖ్య 48కు చేరింది. ఓవరాల్ గా దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 124000కు చేరింది. ఇప్పటివరకు 50000మంది బాధితులు కోలుకోగా 3450కు పైగా మరణాలు సంభవించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: