ప్రస్తుతం ప్రపంచ దేశాలలో కరోనా  వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ మహమ్మారి వెలుగులోకి వచ్చి ఎన్నో రోజులు గడుస్తున్నాప్పటికీ ఈ మహమ్మారి వైరస్ కు అసలు విరుగుడు మాత్రం కనుగొనబడలేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నప్పటికీ అవి సత్ఫలితాలను మాత్రం ఇవ్వడంలేదు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కరొనా  వైరస్ కారణంగా సంక్షోభంలో కూరుకు పోతున్నారు. దీంతో కనీసం కరోనా  వైరస్ కోసం చేసే పరిశోధనలు కూడా డబ్బు వెచ్చించడానికి ఆలోచించాల్సిన పరిస్థితి. దీంతో ఇప్పటికే చాలా దేశాల్లో వాక్సిన్ కనుగొనేందుకు సంబంధించిన పరిశోధనలు ఆగిపోయాయి. 

 


 ఈ నేపథ్యంలో అమెరికా ముందుకు వచ్చింది. ఎవరైతే కరోనా   వైరస్  కు సంబంధించి పరిశోధనలు చేస్తున్నారో  వారికి ఆర్థిక సాయం అందిస్తామని అమెరికా తెలిపింది . కరోనా  వైరస్ వ్యాక్సిన్ కోసం పరిశోధన చేస్తున్న వారికి పెట్టుబడులు పెడుతుంది అమెరికా. అమెరికా ప్రభుత్వం ఏకంగా దీనికోసం 1 బిలియన్ డాలర్లు వాక్సిన్  కి సంబంధించినటువంటి పరిశోధనల కోసం విడుదల చేస్తుంది. ప్రపంచ దేశాల్లో చాలా మేధస్సు ఉన్నప్పటికీ.. ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాకపోవడంతో పరిశోధనలు జరగడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాక్సిన్ తయారు చేయడానికి ఏకంగా 70 నుంచి 80 పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో  ముందుగా ఏది వస్తే   ఏది పేటెంట్ రైట్స్ ని ముందుగా సొంతం చేసుకుంటే దాన్ని ప్రపంచవ్యాప్తంగా సప్లె  చేయడానికి అవకాశం ఉంటుంది.

 


 మిగతా పరిశోధనలకూ  ఎన్ని డబ్బులు పెట్టినా  ఉపయోగం లేకుండా పోతుంది. అయితే ఇవన్నీ తెలిసిన అమెరికా ప్రభుత్వం మాత్రం ధైర్యం చేస్తుంది అని చెప్పాలి . వాక్సిన్ తయారీ కోసం ఏకంగా పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చింది. ఒకవేళ అమెరికా పెట్టుబడులు పెడుతున్న పరిశోధనలు కరోనా  వైరస్ వ్యాక్సిన్ కనిపెడితే అమెరికాకు రెండు ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఒకటి అమెరికాలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా.. వారు ప్రత్యేకంగా వైరస్ వ్యాక్సిన్ కొనవలసిన అవసరం లేదు.. అంతేకాకుండా ముందుగా అమెరికా దేశం వ్యాక్సిన్  కనుగొనబడింది మళ్లీ అగ్రస్థానంలో అమెరికానే  నిలిచింది అని చెప్పుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ వాక్సిన్ సక్సెస్ అయితే భారీ లాభం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: