గత కొన్ని రోజుల నుంచి నేపాల్ ప్రభుత్వం భారత దేశం పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోందన్న  విషయం తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కాదు.. పలు చర్యలతో ఏకంగా కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగా వ్యవహరిస్తోంది  నేపాల్. మొన్నటికి మొన్న అధికారికంగా విడుదల చేసిన నేపాల్ మ్యాప్ లో ఏకంగా భారతదేశానికి చెందిన కొన్ని భాగాలను చైనా భూభాగాలు గా చూపిస్తూ విడుదల చేసింది. ఈ భూభాగాన్ని నేపాల్ చెందినవని  అంటూ తెలిపిన నేపాల్ ప్రభుత్వం వీటిని స్వాధీనం చేసుకుంటామని తెలిపింది. అంతేకాకుండా చైనా నుంచి కాకుండా భారత్ నుంచి వస్తున్న వైరస్ ఎంతో  ప్రమాదకరంగా మారింది అంటూ వ్యాఖ్యలు చేశారు నేపాల్ ప్రధాని.

 


 అయితే నేపాల్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక మూడు కారణాలు ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు. ఒకటి ప్రస్తుతం నేపాల్ ప్రజలందరికీ భారతదేశంతో  అన్ని సంబంధాలు ఉన్నాయి. కానీ అది చైనాతో మాత్రం లేదు. దీంతో  భారత్తో శత్రుత్వం పెంచుకుంటే నేపాల్ ప్రజలందరూ చైనా దేశం వైపు మల్లె  అవకాశం ఉంది అంటూ నేపాల్ ప్రధాని భావిస్తున్నారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. అంతే కాకుండా ఏదో ఒక సంచలనం  సృష్టించి దానిని నేపాల్ ప్రధాని పరిష్కరిస్తే మరోసారి నేపాల్ ప్రజలందరూ కమ్యూనిస్టు నాయకుడైన ఓక్ ని  హీరోగా  అనుకుంటారు అనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. 

 


 అంతేకాకుండా ఇప్పటికీ చైనా ప్రభుత్వం నుంచి నేపాల్ సర్కార్  భారీ మొత్తంలో అప్పు తీసుకున్న నేపథ్యంలో చైనాతో మిత్రపక్షంగా ఉంటే అప్పు  సత్వరంగా  చెల్లించాల్సిన అవసరం ఉండదని అంతేకాకుండా ప్రస్తుతం కరోనా  కష్టకాలంలో కూడా చైనా నుంచి మరింత అప్పు పొందే అవకాశం కూడా ఉంది అని నేపాల్ ప్రధాని భావిస్తున్నట్లు  విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం నేపాల్ ప్రధాని వోక్  భారత దేశం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. వైరాలజీ నిపుణుడు అయినప్పటికీ కరోనా  వైరస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: