మాములుగా కొన్ని సార్లు   కొన్ని విచిత్ర కేసులు నమోదు అవుతుంటాయి. అయితే ఇవన్నీ  కేవలం కాలక్షేపం కోసం తప్ప మిగతా దేనికి ఉపయోగపడవు. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి  సోనియాగాంధీపై ఇలాంటి కేసు ఒకటి  నమోదయింది. అయితే కరోనా  వైరస్ నేపథ్యంలో కేంద్రం  సరిగ్గా  పనిచేయడం లేదు అంటూ ఇప్పటికే సోనియాగాంధీ పలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అటు బీజేపీ కాంగ్రెస్ వచ్చిన విమర్శలు పర్వం  కొనసాగింది. అయితే గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ప్రధానమంత్రి కేర్  ఫండ్స్ గురించి చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ తాజాగా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. 

 


 కర్ణాటకలో తాజాగా సోనియాగాంధీకి ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. శివమొగ్గ  సోనియాగాంధీపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. పీఎం కేర్స్ ఫండ్  మే 11వ తేదీన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు తప్పుబడుతూ ఈ కేసు నమోదైంది. మే 11వ తేదీన కాంగ్రెస్ అధినేత్రి పీఎం కేర్ ఫండ్స్ ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో కామెంట్స్  చేశారని... ఇందులో పి ఎం కేర్ ఫండ్స్ అనేది ఒక ఫ్రాడ్  అంటూ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది.. ప్రజలకు సంబంధించిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారు అంటూ సోనియా గాంధీ ఆరోపించారు. అయితే దీనిని తప్పుబడుతూ తాజాగా ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. కరోనా కష్టకాలంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా సోనియాగాంధీ వ్యాఖ్యలు చేశారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

 


 ఇక ఈ కేసును ఏకంగా ఇద్దరు న్యాయవాదులు వేశారు. అయితే లాయర్లు ఈ కేసు వేయడం ద్వారా కేవలం వాళ్లకు మాత్రమే పబ్లిసిటీ వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో విమర్శలు చేయడం తప్పు కాదని... ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేస్తే అధికార పార్టీ దానికి వివరణ ఇచ్చిందని ఇది సర్వసాధారణం అంటున్నారు. అయితే రాజకీయాన్ని రాజకీయంగా చూసుకోవాలి కాని దానిని న్యాయస్థానాలు ఏం చేస్తాయి అంటూ ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. ఇలాంటి కేసులు పెట్టడం ద్వారా కేసు వేసిన వారికి పాపులారిటీ రావడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: