ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయకులను అస్సలు నమ్మరు అని చాలామంది ఆయన గురించి తెలిసిన వాళ్ళు అంటారు. చంద్రబాబు వ్యవహార శైలి అంతా యూజ్ అండ్ త్రో విధంగా ఉంటుందని బాబు వ్యవహార శైలిపై చాలామంది సీనియర్స్ కామెంట్ చేయడం మనం చాలాసార్లు విన్నాం. కానీ ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబు చాలా బలంగా నమ్మే అంశం ఏమిటంటే వ్యక్తిగతంగా కంటే పార్టీ కోసం, పార్టీ ప్రయోజనాల కోసం కష్టపడి పని చేసే నాయకులను చంద్రబాబు ఏమాత్రం వదులుకోరు. అటువంటి సందర్భాలు టీడీపీలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీలో అటువంటి స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక నాయకుడు టెక్కలి ఎమ్మెల్యే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. 

 

విభజన జరిగిన తర్వాత నుండి చంద్రబాబు ఎక్కువగా నమ్మిన నాయకుడు అచ్చెన్నాయుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పార్టీ తరపున ఏ విషయం గురించి మాట్లాడాలని అనుకున్నా, ఎలాంటి సమస్య అయినా మీడియా ముందు కనబడే నాయకుడు అచ్చెన్నాయుడు. ప్రతిపక్షంలో వచ్చినా గాని అచ్చెన్నాయుడు ఏ మాత్రం తగ్గకుండా ఎక్కడికక్కడ పార్టీ తరపున పోరాడుతూ వస్తున్నారు.

 

చంద్రబాబు అధికారంలో ఉన్న టైంలో ప్రభుత్వానికి ఎదురైనా కీలక విషయాలలో అచ్చెన్నాయుడు ని రంగంలోకి దింపి చాలా విషయాలను డీల్ చేయడం జరిగింది. అటువంటిది ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ని ఇరుకున పెట్టిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సంఘటన విషయంలో టిడిపి నిజనిర్ధారణ కమిటీకి అచ్చెన్నాయుడునే చంద్రబాబు చైర్మన్‌గా నియ‌మించారు. విశాఖపట్టణంలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న కానీ చంద్రబాబు మాత్రం నమ్మింది వన్ అండ్ ఓన్లీ అచ్చెన్నాయుడునే. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రోజే పార్టీకి అంతకుముందు విధేయులుగా ఉన్న చాలామంది జంప్ అయిపోయారు. కానీ ఇలాంటి కష్ట సమయంలో కూడా అచ్చెన్నాయుడు మాత్రం పార్టీని వదలకుండా వీర విధేయుడిగా ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: