ఆల్ ఖైదా  అనే ఉగ్రవాద సంస్థ భారత దేశ వ్యాప్తంగా ఎన్ని విధ్వంసం సృష్టించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం భారత దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విధ్వంసాలను సృష్టించింది ఈ సంస్థ. ప్రపంచ దేశాల పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పి వినాశనం సృష్టించేలా ట్రైనింగ్ చేస్తుంది. హవాలా  వ్యాపారం.. సెక్స్ మాఫియా .. అక్రమంగా మాదకద్రవ్యాలు వ్యాపారం లాంటివి చేస్తూ.. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆయుధాల కొనుగోలు చే పడుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో ఇలాంటి అక్రమ వ్యాపారాలు చేపడుతూ ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ ఎంతగానో డబ్బు సంపాదిస్తూ ఎంతో మంది ఉగ్రవాదులను తయారు చేసేందుకు ఖర్చు పెడుతూ ఉంటుంది. 

 


 అయితే తాజాగా ఆల్ ఖైదా  కు చెందిన ఒక కీలకమైన అటువంటి తీవ్రవాది. ఆల్ ఖైదా  చీఫ్ ఫైనాన్షియల్ సలహాదారు మహమ్మద్ ఇబ్రహీం ను  ప్రస్తుతం అమెరికా భారతదేశానికి అప్పగించింది. సదరు తీవ్రవాది నుంచి తమకు కావలసినంత  సమాచారం తీసుకున్న తర్వాత.. తాజాగా ఆ ఉగ్రవాదిని భారత్కు అప్పగించింది అమెరికా. ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన తీవ్రవాది  ఇండియాలో ఎలాంటి విధ్వంసం సృష్టించారు విధ్వంసం వెనుక ఎవరు ఉన్నారు. అంతే కాకుండా ఇప్పటి వరకు ఉగ్రవాదులకు ఆయుధాల తయారీకి ఉగ్రవాదులకు చూసుకోవడానికి డబ్బులు ఎలా వచ్చాయి. ఎలాంటి అక్రమ వ్యాపారాలు చేశారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రస్తుతం ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థలో  కీలక తీవ్రవాదిని తాజాగా భారత్కు అప్పగించింది అమెరికా. 

 

 

 అయితే అమెరికా సదరు తీవ్రవాది నుంచి తమకు కావాల్సిన  సమాచారాన్ని సేకరించి ప్రస్తుతం భారత్కు అప్పగించం ఒక గొప్ప దౌత్యపరమైన సంబంధం అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ప్రస్తుతం కీలక తీవ్రవాది గురించి ఎందుకు అంతలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వచ్చింది అంటే... అమెరికా భారతదేశానికి ఉగ్రవాడిని  అప్పగిస్తే  తమ మధ్య ఉన్న దౌత్యపరమైన సంబంధాలను చాటి  చెబుతుంటే ఒక నేషనల్  మీడియా మాత్రం దీనిని విచిత్రంగా చిత్రీకరించింది. భారతదేశపు ఇంజనీర్ని అమెరికా భారత్ కి అప్పగించింది  అని  ఒక కథనం ప్రచురించింది. అయితే ఉగ్రవాదిని ఉగ్రవాది అని చెప్పకుండా భారత ఇంజనీరు అని చెప్పడం నిజంగా సిగ్గుచేటు అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: