ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది ఆయన వ్యవస్థలను మేనేజ్ చేస్తుంటారని.. ప్రధానంగా కీలక ప్రభుత్వ సంస్థల్లోకి తన వ్యక్తులను ప్రవేశపెడతారని.. వారి ద్వారా వ్యవస్థలను మేనేజ్ చేస్తారనే విమర్శ చంద్రబాబుపై ఎప్పటి నుంచో ఉంది. దాదాపు 40 ఏళ్లకుపైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ కోర్టు మెట్లెక్కలేదని చెప్పుకునే చంద్రబాబు.. తాను తెచ్చుకున్న స్టేల విషయంపై మాత్రం నోరు మెదపరు.

 

తాజాగా చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసే అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఎలాగంటే.. డాక్టర్ సుధాకర్ పై పోలీసుల దౌర్జన్యం అంశంలై సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. దీనిపై వైసీపీ కాస్త ఘాటుగానే స్పందించింది. ఈ తీర్పుపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ స్పందించారు. అసలు.. హైకోర్టు ఇచ్చే తీర్పు పది నిమిషాల ముందే చంద్రబాబుకు తెలుస్తుందని ప్రశ్నించారు.

 

 

ఈ విషయంలో నిజాలు రాబట్టాలంటే.. మొదట చంద్రబాబును విచారించాలన్నారు. చంద్రబాబు కాల్‌ లిస్టు బయటపెట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ నందిగం సురేష్‌ డిమాండ్‌ చేశారు. డాక్టర్‌ సుధాకర్‌ బాబు వెనుక ఏదో పెద్ద సపోర్టు ఉంది కాబట్టే ముఖ్యమంత్రి పట్ల అసభ్యకరంగా మాట్లాడాడని, దీని వెనుక కుట్ర కోణం దాగి ఉందని ఎంపీ నందిగం సురేశ్ అన్నారు. సుధాకర్‌బాబు వ్యవహారాన్ని హైకోర్టు సీబీఐకి అప్పగించడం మంచిదేనని ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు.

 

 

లేదంటే వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం కాబట్టి వారికి ఇష్టం వచ్చినట్లుగా ఎఫ్‌ఐఆర్‌ రాసుకున్నారని టీడీపీ నాయకులు మాట్లాడే పరిస్థితి లేకపోలేదన్నారు. ఎవరి తప్పు ఏంటో సీబీఐ విచారణలో బయటకు వస్తాయని ఎంపీ నందిగం సురేశ్ అన్నారు. అయితే చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తే చేయవచ్చు గాక. కానీ దాన్ని నిరూపించే సాక్ష్యాలు సంపాదించడం మాత్రం అంత సులభం కాదు కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: