మనుషుల్లో మానవత్వం నశిస్తుంది అనడానికి నిత్యం లోకంలో జరుగుతున్న సంఘటనలే ఉదాహరణ.. సాటి మనిషి ప్రమాదంలో ఉన్నాడని తెలిసిన కూడా కొందరైతే పట్టించుకోకుండా వెళ్లుతున్నారు.. అదే వారి కుటుంబ సభ్యులకు ఇలా జరిగితే అప్పుడు కూడా అలాగే వెళ్లుతారా.. మంచి మాటలు నలుగురికి చెప్పడమే కానీ ఆచరించే వారే కరువవుతున్నారు అనడానికి ఇప్పుడు జరిగిన ఘటనే నిదర్శనం.. అదేమంటే ఓ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఏ పాపం తెలియని ఓ బాలుడికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ దుర్ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా నడికూడ మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది..

 

 

అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. పత్తి గింజల లోడుతో వెళ్తున్న లారీ నడికుడ గుండా వెళ్తుండగా.. ఆ రోడ్డుపై వేలాడుతున్న కరెంటు వైర్లు తెగి లారీకి చుట్టుకున్నాయట, ఈ విషయాన్ని గమనించిన ఆ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా అలాగే ముందుకు వెళ్లుతుండగా, అదే రోడ్డుపై నడిచి వెళ్తున్న మిట్టి రాజు అనే 12 ఏళ్ల బాలుడి కాళ్లకు వైర్లు చుట్టుకోగా ఆ లారీ డ్రైవర్ మాత్రం ఈ విషయాన్ని గ్రహించక అలాగే ముందుకు వెళ్లుతున్నాడట.. అలా ఏకంగా బాలుడ్ని 2 కిలో మీటర్ల దూరం వరకు ఆ లారీ లాక్కెళ్లిందని తెలిపారు..

 

 

ఇక ఆ రహదారి గుండా వెళ్ళుతున్న వాహనదారులు, గ్రామస్తులు ప్రమాదాన్ని పసిగట్టి లారీని అడ్డగించారట. కానీ అప్పటికే ఆ ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడగా, వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారట. పోలీసులకు సమాచారం తెలియడంతో ఘటన స్థలానికి చేరుకున్న వారు విచారణ జరుపుతున్నారు.. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో పెద్ద వాహనాలు నడిపే వారు మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.. అభం శుభం తెలియని వారి ప్రాణాలు తీస్తున్నారు.. ఎవరో చేసిన తప్పుకు ఏ పాపం తెలియని ప్రాణాలు పోవడం దురదృష్టకరం.. ఇక ఈ బాలుడికి జరగరానిది ఏమైనా జరిగితే ఆ తల్లి కన్నీరుకు బాధ్యులు ఎవరు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: