మన తెలుగులో కొంత మంది రాజకీయ నాయకులకు గుర్తింపు అనేది తక్కువ కాలంలో వచ్చేసింది. వారిలో ప్రధానంగా చెప్పుకునే వారు కొందరు ఉన్నారు. వారు ఎవరూ అనేది ఒకసారి చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ గా అదే రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఘనత సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఆయన ఆఖరి సిఎం. ఇక ఆయన వ్యక్తిగత జీవితం చాలా మందికి తెలియదు. తండ్రి బలమైన రాజకీయ నాయకుడు చిత్తూరు జిల్లాలో. కాంగ్రెస్ లో ఆయన ఎన్నో పదవులను అనుభవించి ఆ తర్వాత చిత్తూరు జిల్లా రాజకీయాలను కంటి తో శాశించారు. 

 

ఇక కిరణ్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే యువ నాయకుడిగా కాంగ్రెస్ లోకి అడుగు పెట్టి అప్పటి మాజీ సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో పాటుగా ఎందరో కాంగ్రెస్ నాయకులకు ఆయన సన్నిహితంగా మెలిగిన సంగతి తెలిసిందే. ఇక ఆయన పుట్టిన ఊరు పెరిగిన ఊరు ఏంటీ అనేది చాలా మందికి అవగాహన అనేది లేదు. ఇక ఆయనది చిత్తూరు జిల్లాలోని నగిరిపల్లె అనే ఊరు. ఆయన అక్కడ పుట్టలేదు. ఆయన పుట్టే నాటికి ఆయన తండ్రి బలమైన రాజకీయ నాయకుడు కావడం ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండటం తో ఆయన ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండే వారు. 

 

ఇక చదువు కూడా ఎక్కువగా కిరణ్ ది హైదరాబాద్ లోనే సాగింది. ఆయనతో పాటు చదువుకున్న వారు చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు. నందమూరి బాలకృష్ణ కూడా యాన తో మంచి స్నేహం ఉంది అని చెప్తూ ఉంటారు. ఇక ఆయన ఇప్పుడు రాజకీయాలకు చాలా వరకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ లో తిరిగి వచ్చినా సరే పెద్దగా ఆయన పేరు అనేది ఎక్కాడా కూడా వినపడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: