ఆంధ్రజ్యోతి.. తెలుగు టాప్ 5 పేపర్లో ఒకటిగా ఉంటోంది. తెలుగు దిన పత్రికల్లో ఈనాడు మొదటి స్థానంలో ఉంటే.. సాక్షి రెండో ప్లేసులోనూ ఆంధ్రజ్యోతి మూడో స్థానంలోనూ కొంతకాలంగా కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు తెలుగుదేశానికి అనుకూలంగానూ.. సాక్షి పత్రిక జగన్ కు అనుకూలంగా ఉంటాయన్న సంగతి బహిరంగ రహస్యమే. ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండూ టీడీపీ అనుకూల పత్రికలుగా ముద్ర ఉన్నా.. రెండింటి ప్రజంటేషన్‌లో తేడా ఉంటుంది.

 

 

ఈనాడు తెలుగుదేశం అభిమానం కాస్త పద్దతిగా ఉంటే.. ఆంధ్రజ్యోతిది మరీ కరపత్రిక తరహా జర్నలిజం అనే చెప్పాలి. ఇక గత ఎన్నికల ముందయితే అది మరీ విశృంఖలంగా తయారైందన్న విశ్లేషణలు వచ్చాయి. అయితే ఆంధ్రజ్యోతి చంద్రబాబు భజన.. అటు చంద్రబాబుకూ మొన్నటి ఎన్నికల్లో ఏమాత్రం మేలు చేయలేదని ఫలితాలే రుజువు చేశాయి. అటు చంద్రబాబుకు ఉపయోగపడకపోగా..ఇటు సర్క్యులేషన్ పై దారుణమైన దెబ్బ పడిపోయింది.

 

 

అంటే రెండింటికీ చెడ్డ రేవడి లా అయ్యింది ఆంధ్రజ్యోతి పరిస్థితి.. ఇందుకు తాజాగా ఏబీసీ అంటే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ విడుదల చేసిన గణాంకాలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తెలుగుదేశానికి డప్పు కొట్టీ కొట్టీ ఆంధ్రజ్యోతి దారుణంగా దెబ్బతిన్నది. తాజా గణాకాల ప్రకారం సాక్షి 15,647 కాపీలు పెంచుకుంటే.. ఈనాడు ఏకంగా 41,307 కాపీలు కోల్పోయింది. ఆంధ్రజ్యోతి పరిస్థితి మరీ దారుణం. అది ఘోరంగా 58,875 కాపీల్ని పోగొట్టుకుంది.

 

 

ఏబీసీ లెక్కల ప్రకారం.. గత డిసెంబరు వరకు ఏపీలో ఈనాడు సర్క్యులేషన్ 8.49 లక్షలు కాగా.. సాక్షి సర్క్యులేషన్ 6.08 లక్షలు, జ్యోతి సర్క్యులేషన్ 3.80 లక్షల కాపీలు. ఇక ఇప్పుడు కరోనా దెబ్బతో ఇంకెంతగా ఈ పత్రికల సర్క్యులేషన్ తగ్గిపోయిందో.. ఆ లెక్కలు ఇప్పుడే రావు.. కాస్త సమయం పడుతుంది. మొత్తానికి చంద్రబాబు భజన ఆంధ్రజ్యోతికి బాగానే దెబ్బేసిందన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: