ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతి తక్కువ కాలంలో అతి పెద్ద ముద్ర వేసుకున్న నాయకుడు కోడెల శివప్రసాద రావు. డాక్టర్ గా ఆయన చదువుకున్నా సరే రాజకీయాల్లోకి అడుగు పెట్టి రాజకీయాలను శాశించారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఆయన తక్కువ కాలంలో తన ముద్ర వేసుకున్నారు. ముఖ్యమంత్రి కుటుంబానికి ఎదురు వెళ్లి వాళ్ళతో పోటీ కి దిగి తన సత్తా ఏంటో చాటిన నాయకుడు ఆయన. ఇక యువతలో ఆయనకు మంచి క్రేజ్ ఉండేది అప్పట్లో. ఆయన రాజకీయాన్ని దగ్గరగా చూసిన ఎందరో ఆయనను బాగా అభిమానించే వారు అప్పట్లో 

 

ఎన్టీఆర్ పిలుపు తో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తన జిల్లాలో ఫ్యాక్షన్ ఎక్కువగా ఉన్నా సరే ఎక్కడా కూడా భయపడి రాజకీయం చేసిన సందర్భం లేదు అనే చెప్పాలి. ఇక ఆయన సొంత ఊరు విషయానికి వస్తే నరసరావు పేట దగ్గర ఉండే కొంద్రగుంట ఆయన సొంత ఊరు. ఆయన అక్కడే ఎక్కువగా పెరిగారు... ఆయన చదువు మొత్తం కూడా ఎక్కువగా గుంటూరు లో సాగింది. వైద్య విద్యను కూడా ఆయన అక్కడే అభ్యసించారు. ఇక ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను శాశించే స్థాయికి ఆయన వెళ్ళారు అంటే కచ్చితంగా ఆయన ప్రతిభ తోనే సాధ్యం అని చెప్తూ ఉంటారు. 

 

ఇక ఆయన మరణం తర్వాత గ్రామంలో పెద్దగా ఆయన కుటుంబం కూడా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోం మంత్రిగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎక్కువగా వివాదాస్పదం అయ్యేవి. వంగవీటి రంగా హత్యలో ఆయన పాత్ర కూడా ఉందని చెప్తూ ఉంటారు. ఇక ఆయన ఎన్టీఆర్ కి చంద్రబాబు కి ప్రధాన బలం అనే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత తర్వాత ఆయన ఇమేజ్ కొన్ని కారణాలతో మసకబారింది అనే వాళ్ళు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: