ప్రస్తుతం దేశంలో అందరినీ ప్రాణభయంతో వణికిస్తున్న కరోనా వైరస్ ఎన్నో విచిత్రాలను కూడా చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా మనిషి జీవితం దుర్భరంగా మారిపోతుంది. కేవలం బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు చనిపోయిన తర్వాత శవం గా ఉన్నప్పటికీ దుర్భరంగా మారిపోతుంది. కనీసం కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు కూడా నోచుకోలేని పరిస్థితులు. అయితే తాజాగా ఇక్కడ ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ఎలాంటి మృతదేహం లేకుండానే మృతుడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపించారు. శాస్త్రోక్తంగా మృతదేహం లేకుండానే అత్యక్రియలు జరిపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన ఒడిస్సా రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ వింత ఘటన తో అటు  చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. 

 


 కరోనా సంక్షోభం నేపథ్యంలో మృతదేహం లేకుండానే మృతుడి కుటుంబ సభ్యుల అంత్యక్రియలు జరిపిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా హారీపూర్ గ్రామంలో జరిగింది. గుజరాత్లోని సూరత్ నగర్ లో వలస కార్మికుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి లాక్ డౌన్ లో చిక్కుకొని తాజాగా తన స్వస్థలమైన హాజీపూర్ కి తిరిగి వచ్చాడు. ఇక ఆస్తమాతో బాధ పడుతున్న సదరు వలస కార్మికుడుని అతని కుటుంబ సభ్యులు ఈ నెల 12వ తేదీన భాంజానగర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి బెర్హం పూర్ నగర్లోని మెడికల్ కళాశాలకు తరలించారు. ఇక ఆ మెడికల్ కళాశాల నుంచి సదరు వలస కార్మికులు సీతారామ్ పల్లిలోని  కరోనా వైరస్ ఆస్పత్రికి తరలించారు. 

 

 ఇక అప్పటికే ఆరోగ్యం విషమించడంతో కరోనా వైరస్ లక్షణాలు తో మరణించాడు సదరు వ్యక్తి. దీంతో ఎక్కడ ఆ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందో  అనే అనుమానంతో అక్కడి వైద్యులు మృతదేహానికి పరీక్షలు నిర్వహించారు. కాగా ఈ పరీక్షల్లో సదరు వలస కార్మికుడికి కరోనా  వైరస్ లేదు అని తేలింది. కానీ పొరపాటున అక్కడి వైద్యులు సదరు వలస కార్మికుడు  కరోనా  వైరస్ బారినపడి మరణించాడు అని ప్రకటించారు. దీంతో ఇది సంచలనంగా మారిపోయింది. ఇక సదరు వలస కార్మికుడి  మృతదేహాన్ని దహనం చేసేందుకు అంగీకరించలేదు హాజీపూర్ గ్రామస్తులు. దీంతో కుటుంబ సభ్యులు చేసేదేమీ లేక ఆమె మృతదేహాన్ని సీతరాంపల్లి లో అంత్యక్రియలు జరిపించారు. కానీ మృతుడి కుటుంబ సభ్యులు ఇసుకతో  బొమ్మలు తయారు చేసే క్రమంలో శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: