వెంకయ్య నాయుడు... భారత రాజకీయాల్లో ఈ పేరు ఒక సంచలనం. ఆయన రాజకీయాల్లో చిన్న నాటి నుంచి కూడా ఉన్న ప్రేమ తో ప్రత్యేకంగా అడుగులు వేసి... తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. వరుసగా రాజకీయాల్లో ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చి ఎవరికి అందని ఎత్తులో నిలిచారు అయన. ఆయన ఎప్పుడు రాజకీయం చేసినా సరే హుందా గానే రాజకీయం చేసారు. జనత పార్టీ నుంచి ఆయన ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళారు. మాజీ ప్రధాని వాజపేయి తో అత్యంత సన్నిహితంగా ఉండే వారు. ఆయన తో కలిసి కష్టాల్లో సుఖాల్లో కూడా కలిసి అడుగులు వేసారు. 

 

ఇక బిజెపి లో రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షిడిగా కేంద్ర మంత్రిగా ఆయన ఎన్నో విజయాలు ఆయన జీవితంలో ఎన్నో పదవులు. ఎక్కువగా కేంద్ర మంత్రిగా ఆయన చేసిన సేవలు కేంద్ర ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంస్కరణలు అన్నీ కూడా చిరస్థాయిలో నిలిచాయి అని చెప్పుకోవచ్చు. ఆయన రాజకీయాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు అయినా సరే భయం లేకుండా రాజకీయ౦ చేసారు. ఇక ఇప్పుడు ఆయన భారత ఉప రాష్ట్రపతిగా ఆన్నారు. అయినా సరే ఆయన మార్క్ ఏదోక రూపంలో కనపడుతూనే ఉంటుంది. ఆయన గురించి ఏదోక సందర్భంలో ప్రస్తావిస్తూనే ఉంటారు. 

 

ఇక ఆయన సొంత ఊరు నెల్లూరు జిల్లా చవట పాలెం. అక్కడి నుంచి ఆయన అంచెలు అంచెలు గా పైకి వచ్చారు. జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఆయన వెళ్ళారు. 2014 లో ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నిక అయిన తర్వాత ఆయనకు పరిపాలనలో వెంకయ్య అందించిన సహాయ సహకారాలు అన్నీ ఇన్నీ కాదు.  మోడిలో ముందు కంగారు ఉండేది అని అయినా సరే వెంకయ్య ఆయనకు అండగా నిలిచి ముందుకు నడిపించారు అని అంటారు. అందుకే వెంకయ్య అంటే మోడికి ప్రత్యేక అభిమానం అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: