ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 సంవత్సరంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కృషితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్సార్ రైతులకు ఉచిత కరెంట్ ఫైలుపై తొలి సంతకం పెట్టారు. 70 రూపాయల పింఛన్ ను 200 రూపాయలకు పెంచారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా చేశారు. 
 
రాష్ట్రంలోని బాసర, నూజీవీడు, ఇడుపులపాయలో మూడు ట్రిపుల్ ఐటీలను నెలకొల్పి టాలెంట్ ఉన్న విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా చేశారు. రాజన్న పాలనను జనం మెచ్చి రెండోసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. నేటికీ రాజన్న పాలనను ప్రజలు స్వర్ణ యుగంతో పోలుస్తారంటే దివంగత నేత వైయస్సార్ పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 
దివంగత నేత వైయస్సార్ మరణం అనంతరం రోశయ్య, కిరణ్ కుమార్ ముఖ్యమంత్రులుగా పాలన సాగించినా ప్రజల్లో కనీస గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. 2014 ఎన్నికలకు ముందు అసత్య ప్రచారాలతో, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎన్నికల ఫలితాల అనంతరం ఒక్క హామీని కూడా నెరవేర్చలేక ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. 
 
అనంతరం 2019 మే 11వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరగగా మే 23న ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని విజయాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. 92 శాతం ఎంపీ సీట్లలో, 86 శాతం అసెంబ్లీ సీట్లలో విజయం సాధించి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. నేటితో ఆ చారిత్రక విజయానికి ఏడాది పూర్తైంది. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ జగన్ రాజన్నను మరిపిస్తున్నారని జనం అభిప్రాయపడుతున్నారు.      
                  

మరింత సమాచారం తెలుసుకోండి: