ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా... మాస్టర్ మైండ్ తో ముందుకు సాగే వ్యక్తిగా... రాజకీయాల్లో  విజయవంతంగా ప్రస్థానాన్ని కొనసాగించిన గొప్ప లీడర్గా.. ఎంతగానో తెలుగు రాజకీయాల్లో  స్థానం సంపాదించారు చంద్రబాబు నాయుడు. అయితే ఎక్కువ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో చంద్రబాబు నాయుడు కూడా ఒకరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చంద్రబాబునాయుడు తనదైన రాజకీయ వ్యూహాలతో ఎప్పుడు... అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు. దాదాపుగా 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న గొప్ప రాజకీయ మేధావి చంద్రబాబునాయుడు. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎదిగినప్పటికీ తన సొంతూరు ని మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. 

 

 

 చంద్రబాబుది  నాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె. నారావారిపల్లెలో జన్మించారు చంద్రబాబునాయుడు. ఖర్జూర నాయుడు అమ్మన్నమ్మ దంపతులకు జన్మించారు చంద్రబాబు నాయుడు. వెంకటేశ్వర యూనివర్సిటీ లో పీజీ ఉన్నత విద్యను పూర్తి చేశారు నారా చంద్రబాబు నాయుడు. అయితే విద్యార్థి దశ నుంచి రాజకీయ వ్యూహాలను పుణికి తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు... కాలేజీలో చదివే సమయం నుంచే విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇక ఆ తర్వాత 1978 లో యూత్ కాంగ్రెస్ తరపున కాంగ్రెస్ అధినేత్రి అయినా ఇందిరాగాంధీని ఒప్పించి మరి చంద్రగిరి సీట్ దక్కించుకుని గెలుపొందారు చంద్రబాబు నాయుడు. 

 


 అదే సమయంలో ఏకంగా మంత్రి పదవిని కూడా సంపాదించారు. ఇక సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరీని పెళ్ళిచేసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్  అల్లుడు గా మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ని వదిలి  టిడిపి పార్టీలో చేరడం. ఆ తర్వాత క్రమక్రమంగా పార్టీని తన ఆధీనంలోకి తెచ్చుకోవటం .. ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడం. ఈ చరిత్ర అంతా అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పటికీ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ... పండుగలను మాత్రం తన సొంతూరు నారావారిపల్లెలో ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇప్పటికీ కూడా. అయితే నారావారిపల్లె అంటే చంద్రబాబుకు ఎంతో ఇష్టం. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం నారావారిపల్లె ఎంతగానో చంద్రబాబు నాయుడు హయాంలో అభివృద్ధి జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: