సీనియర్ నటి వాణిశ్రీ కొడుకు మరణం తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న వాణిశ్రీ కొడుకు అభినయ్ వెంకటేష్... ఈ రోజు ఉదయం కన్ను మూశారు. అయితే వాణిశ్రీ కొడుకు అనుమానాస్పద మృతి తో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. అయితే వాణిశ్రీ కొడుకు అభినయ్ వెంకటేష్ మొదట గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత వాణిశ్రీ కొడుకు  వినయ్ వెంకటేష్ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదిలారు అని చెప్పారు. కాగా ప్రస్తుతం  కొడుకు అభినయ్ వెంకటేష్ కార్తీక్ బెంగళూరులోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తున్నాడు. 

 


 ఇక తాజాగా అభినయ్ వెంకటేష్ ఆత్మహత్య చేసుకోవడంతో తిరుక్కళి  కుండ్రం పోలీస్ స్టేషన్ లో  అనుమానాస్పద మరణంగా కేసు కూడా నమోదు అయ్యింది. కొడుకు మరణం తో సీనియర్ నటి వాణిశ్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అంతా సంతోషంగా ఉంది అనుకుంటున్న తరుణంలో వాణిశ్రీ ఇంట్లో విషాదం నిండిపోయింది. ప్రస్తుతం వాణిశ్రీ కొడుకు అభినయ్ వెంకటేష్ కార్తీక్ ఊటీలో  డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కాగా తాజాగా ప్యాలెస్ పనుల నిమిత్తం చెంగల్ వెళ్లారు అభినయ్ వెంకటేష్ కార్తీక్. ఇక ఆయన కుటుంబ సభ్యులతో ఎంతో సరదాగా గడిపారు. అంతకు ముందు వరకు కుటుంబ సభ్యులతో ఎంతో సరదాగా గడిపిన అభినయ వెంకటేష్ కార్తీక్... ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. 

 


 అభినయ వెంకటేష్ కు ఒక భార్య ఒక కుమారుడు ఉన్నారు. అభినయ్ వెంకటేష్ భార్య కూడా వైద్యురాలిగా నే విధులు నిర్వహిస్తోంది. ఉదయం ఆత్మహత్య చేసుకున్న అభినయ వెంకటేష్ మృత దేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తీసుకువచ్చారు. అయితే అంతకుముందు వరకు కుటుంబంతో ఎంతో సరదాగా గడిపిన అభినయ వెంకటేష్ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి తెలియాల్సి ఉంది. ఇక సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ కార్తీక్ మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అభినయ్ వెంకటేష్ మృతికి సంతాపం తెలియజేస్తూ వాణిశ్రీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను సినీ ప్రముఖులు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరిన్ని వివరాలు సేకరించేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: