మహారాష్ట్రలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసులు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్ర సర్కార్ ఎన్ని  ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే  కేవలం మహారాష్ట్రలోని ఈ వైరస్ వ్యాప్తి తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఈ మహమ్మారి వైరస్ విజృంభణ భారీగా ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర లో నమోదైన 20 వేలకు పైగా కేసులు సగానికి పైగా కేసులు కేవలం ముంబైలోనే ఉండడం గమనార్హం. ఇక ఈ మహమ్మారి వైరస్ కోరలు చాస్తూ అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నప్పటికీ... పోలీసులు మాత్రం విధినిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. 

 

 దీంతో ఏకంగా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తామనుకున్న  పోలీసులు  కూడా ఈ మహమ్మారి వైరస్ కారణంగా ప్రాణాల మీదకు వస్తుంది. ఎంతో మంది పోలీసులు ఈ మహమ్మారి వైరస్ బారినపడి మృత్యువుతో  పోరాడుతున్నారు. ఇప్పుడు వరకు ఏకంగా 1666 మంది పోలీసులు ఈ మహమ్మారి వైరస్ బారిన పడ్డారు. ఇక ఇప్పటి వరకు ఏకంగా 18 మంది మరణించారు. ఇలా ప్రజల ప్రాణాలను రక్షిద్దాం అనుకున్న పోలీస్ అధికారులు సైతం ఈ మహమ్మారి వైరస్ బారినపడి మృత్యువాత పడుతున్నారు. ఇక ఈ మహమ్మారి వైరస్ బారినపడి మృతి చెందినవారి మృతికి సంతాపం తెలియజేశారు ఉన్నతాధికారులు. 

 


 అయితే ఈ మహమ్మారి వైరస్ కారణంగా వరుసగా పోలీసులు బలి కావడం పట్ల రాష్ట్ర డిజిపి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు ఆయన. ఇక ఇప్పటికే వయస్సు పైబడిన వారిని విధుల్లోకి తీసుకురావద్దు అంటూ పోలీస్ వర్గాలు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రస్తుతం మహారాష్ట్ర లో అత్యధిక సంఖ్యలో ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసులు సైతం మృత్యువాత పడటంతో అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సాయుధ పోలీసు దళాల నుంచి సుమారు 2000 మంది అదనపు పోలీసులను మహారాష్ట్రాకి పంపాలి అంటూ కేంద్రాన్ని కోరింది మహారాష్ట్ర ప్రభుత్వం. కాగా ఇప్పటి వరకు మహారాష్ట్రలు ఏకంగా 44,582 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. శుక్రవారం ఒక్కరోజు 63 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకు 1517 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: