ప్రస్తుతం భారతదేశంలో కరోనా కట్టడి నేపథ్యంలో లాక్ డౌన్ 4.0 జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీని కోసం కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తూ కరోనా కట్టడికి పలు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. అయితే కర్ణాటక రాష్ట్రంలో సీఎం ఎడ్యూరప్ప లాక్ డౌన్ 4.0 మొదలైనప్పటి నుంచి అనేక సడలింపులు కర్ణాటక రాష్ట్రంలో చేశారు. అంతేకాకుండా బెంగళూరు నగరంలో కొన్ని సిటీ బస్ సర్వీసులను కూడా మొదలవ్వడం జరిగింది. ఇకపోతే గత వారం రోజుల నుంచి కర్ణాటక రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ విజృంభిస్తుంది అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి రాష్ట్రంలో 1700 పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా 900 మంది కరోనా యాక్టివ్ కేసులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. 


ఇకపోతే రేపు ఆదివారం బెంగళూరు నగరంలో సంపూర్ణ లాక్ డౌన్ చేయాలని మహానగర పాలక కమిషనర్ బి. హెచ్. అనిల్ కుమార్ ఒక వీడియో సందేశాన్ని తెలిపారు. దీనితో బెంగళూరు నగరంలోని అన్ని షాపులు, కమర్షియల్ దుకాణాలు, పార్కులు అన్ని మూసి వేయడం జరుగుతుంది. అది ఎలా ఉంటుంది అంటే లాక్ డౌన్ 1.0 లో ఉన్న ఆకాంక్షలే ఆదివారం కూడా బెంగళూరు నగరంలో వర్తిస్తాయని ఆయన తెలిపారు. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించి పూర్తిగా ఇంట్లోనే ఉండాలి అని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని సీఎం ఎడ్యూరప్ప ఆదేశాల మేరకే లాక్ డౌన్ విధించినట్లు ఆయన తెలిపారు. ఆదివారం నాడు కేవలం మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప మిగతా ఎటువంటి వాహనాలకు అనుమతి ఉండదని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా నగర కమిషనర్ భాస్కర్ రావు తో కలిసి ఈ విషయాన్ని చర్చించినట్లు అనిల్ కుమార్ తెలిపారు. కాబట్టి బెంగళూరు వాసులు కాస్త జాగ్రత్తగా ఉండాలిఅని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: