పాకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో ప్రాణ నష్టం కూడా భారీగానే జరిగింది. అందరూ చూస్తుండగానే క్షణాల్లో విమానం కుప్పకూలిపోయి ఒక్కసారిగా బ్లాస్టింగ్ జరిగి  ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. అయితే తాజాగా ఈ విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఇంజనీర్ మహమ్మద్ కుబేర్ విమానం కుప్పకూలుతున్న సమయంలో తన అనుభవాలని మీడియాతో పంచుకున్నారు. చుట్టూ అంతా మంటలు చెలరేగి పోయాయని... దీంతో ఎటు చూసినా నిప్పు కణికల తప్ప ఏమీ కనిపించకుండా అయిపోయిందని... అదే సమయంలో విమానం లో ఉన్న ప్రయాణికులందరూ ఆర్తనాదాలతో  విలవిలలాడి పోయారని... ఆ సమయంలో తనకు ఏమీ తోచలేదు అంటూ కరాచీ విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఇంజనీర్ మహమ్మద్ జుబేర్  చెప్పుకొచ్చాడు. 

 


 అయితే చావు అంచుల వరకు వెళ్లిన ఆ వ్యక్తి ప్రస్తుతం కరాచీలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా తాను ఆ విమాన ప్రమాదం నుంచి బయటపడిన విధానాన్ని కూడా మీడియాతో చెప్పుకొచ్చాడు వ్యక్తి. అయితే విమానం కొద్దిసేపట్లో ఇళ్లకు  తగిలి కుప్పకూలిపోతుంది అనుకుంటున్న తరుణంలో... సీట్ బెల్ట్ తొలగించి వెలుతురు కనిపిస్తున్న వైపుగా నడిచానని తెలిపారు. ఇక ఈ ప్రమాదం నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ఏకంగా పది అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకానని  తెలిపారు. అయితే విమానాన్ని సరిగ్గా ల్యాండ్ చెయటానికి  పైలెట్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ప్రమాదం మాత్రం జరిగిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 

 

 అయితే పాకిస్థాన్లోని కరాచీలో ప్రయాణికులతో వెళ్తున్న విమానం జనావాసాల్లో  కుప్పకూలిన విషయం తెలిసిందే. కాగా ఈ విమానంలో మొత్తం 99 మంది ఉన్నారు... విమానం ల్యాండింగ్ సమయంలో గేర్ సమస్య తలెత్తినా కారణంగా.. ఈ ప్రమాదం జరిగిందని.. పైలెట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించినప్పటికీ క్షణాల్లోనే ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది అంటూ చెప్పుకొచ్చారు. కాగా  ఇప్పటివరకు ఏకంగా  82 మృత దేహాలను ఘటనా స్థలంలో వెలికి  తీసిన్నట్లు పాక్ మీడియా  ప్రచురించింది. ఇక మృతుల కుటుంబాలకు ప్రధాని ఇమ్రాన్  ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: