దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తరువాత ఇతర దేశాల్లో అనేక రకాల వైరస్ లు వెలుగులోకి వస్తున్నాయి, ‘ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్’ అనే వైరస్ వల్ల అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలలో వేల సంఖ్యలో మృతి చెందాయి.తాజాగా మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. 
 
ఆఫ్రికా నుంచి కొత్త రకం వైరస్ కలకలం సృష్టిస్తోంది. వందల సంఖ్యలో గుర్రాలు ఈ వైరస్ భారీన పడి మృతి చెందాయి. కొత్తగా మరో వైర్ అస్ రావడంతో ఈ వైరస్ గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శాస్త్రవేత్తలు ఈ వైరస్ ఏ జంతువు నుంచి పుట్టిందో తెలుసుకోవడానికి పరిశోధనలు చేస్తున్నారు. థాయ్‌లాండ్‌ రాజధాని అయిన బ్యాంకాక్‌లోని ఓ గుర్రాలశాలలో ఈ వైరస్ భారీన పడి 18 గుర్రాలు చనిపోయాయి. 
 
దాదాపు 500 గుర్రాలు ఈ వైరస్ భారీన పడి చనిపోయినట్టు తెలుస్తోంది. చైనాకు కొన్ని జీబ్రాలను తీసుకెళ్ళేటప్పుడు వాటి నుండి గుర్రాలకు వైరస్ సోకిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మార్చిలో ఇంగ్లాండ్‌లో చనిపోయిన గుర్రాల బ్లడ్ శాంపిల్స్ పరిశీలించగా ఇది ఆఫ్రికన్ వైరస్‌ అని అక్కడి శాస్త్రవేత్తలు తేల్చారు. ఇది మనుషులకు హాని కలిగించే వైరస్ కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
ఆఫ్రికాలోని జీబ్రాస్‌తో సహా ఈక్విన్స్‌లో ఈ వైరస్ విసృతంగా వ్యాప్తి చెందుతుందని... మిడ్జెస్ అనే దోమ లాంటి కీటకాన్ని కొరకడం వల్ల ఈ వైరస్ వ్యాపించిందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వైరస్ ఆసియాలో వ్యాప్తి చెందలేదని చెబుతున్నారు. రోజురోజుకు కొత్త కొత్త వైరస్ లు పుట్టుకొస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.                  

మరింత సమాచారం తెలుసుకోండి: